గెలాక్సీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకి చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ ప్లాంటును ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ రెండు రోజుల క్రితం దీన్ని ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీలో శాంసంగ్ తర్వాత తీసుకురాబోతున్న హై-ఎండ్ గెలాక్సీ నోట్ 9ను తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల చివరిలో దీని తయారీని ప్రారంభించనున్నట్టు శాంసంగ్ సీనియర్ అధికారులు చెప్పారు. ఈ కొత్త తరం డివైజ్.. మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌గా, గ్లోబలీ ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు.
‘నోయిడా ఫ్యాక్టరీలో అన్ని హై-ఎండ్ శాంసంగ్ మోడల్స్‌ను రూపొందించడం జరుగుతుంది. జూలై చివరి నుంచి గెలాక్సీ నోట్ 9 తయారీని ప్రారంభిస్తున్నాం. ఆగస్టు చివరిలో ఈ ఫోన్ దేశీయ మార్కెట్‌లోకి వస్తుంది’ అని సీనియర్ అధికారులు చెప్పారు. విస్తరించడానికి ముందు కంపెనీ ప్రొడక్షన్ అవుట్‌పుట్ 10 శాతం ఎగుమతి చేశామని, అంటే నెలకు 50 లక్షల యూనిట్లు ఎగుమతి చేసినట్టు చెప్పారు. ఈ సెల్‌ఫోన్లను రష్యా, దుబాయ్, తూర్పు యూరోపియన్ దేశాలు, ఆఫ్రికాలకు సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్లాంట్ విస్తరణతో దీన్ని నెలకు 70 లక్షల యూనిట్లకు చేయనున్నారు. 2020 నాటికి 30 శాతానికి ఎగుమతులను పెంచనున్నట్టు తెలిపారు.
త్వరలోనే మేకిన్ ఇండియా ప్రొడక్ట్‌గా గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్న గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ హై ఎండ్ ఫీచర్లు.. 1.8 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను, 64 జీబీ స్టోరేజ్‌ను, 2 టీబీ వరకు విస్తరణ మెమరీని, 6.0 అంగుళాల డిస్‌ప్లేను, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment