లీకైన శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్ల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న శాంసంగ్, దిగ్గజాలను కలవరపెడుతోంది. స్మార్ట్‌ఫోన్ల రారాజుగా ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న శాంసంగ్ త్వరలోనే మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. అదే గెలాక్సీ నోట్ 9గా తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్‌ను ఆగస్టు 9న గ్లోబల్‌గా లాంచ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ డివైజ్ గురించి ఓ టీజ్ కూడా చేసింది. తర్వాత నోట్ లాంచింగ్ ఈవెంట్‌న్యూయార్క్‌లో ఉంటుందని తెలిపింది. అదే రోజు భారత్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్టు దేశీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. నోట్ 9 లాంచింగ్ గురించి ఓ టీజర్‌ను కూడా పోస్టు చేసింది. అదే టీజర్‌ను శాంసంగ్ తన మొబైల్ యాప్‌లో కూడా పొందుపరించింది.
అయితే ఆగస్టు 9న భారత్‌లో గెలాక్సీ 9ను సాఫ్ట్ లాంచ్ చేయనుందని.. అధికారిక లాంచ్ మాత్రం ఆగస్టు 15నేనని, అదే రోజు విక్రయాలు కూడా ప్రారంభమవుతాయనీ తెలుస్తోంది. దీంతో గెలాక్సీ నోట్ 9 అందుబాటులోకి రాబోతున్న తొలి దేశాల్లో భారత్ కూడా ఉంటుంది. ఈ డివైజ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే గెలాక్సీ నోట్ 9 ధర ఎలా ఉంటుందో సమాచారం లేదు. కనీసం 70 వేల రూపాయలు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఆల్ట్రా హై-ఎండ్ ఫోన్‌గా మార్కెటోకి వస్తోంది.
ఇప్పటి వరకు వచ్చిన లీక్‌ల ప్రకారం గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం...
6.4 అంగుళాల హై-రెజుల్యూషన్ ఓలెడ్ స్క్రీన్
3850 ఎంఏహెచ్ బ్యాటరీ
6 జీబీ ర్యామ్
256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ ఓరియో
అమెరికా, ఇతర కొన్ని దేశాల్లో నోట్ 9 ప్రాసెసర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845
స్వదేశం, కీ మార్కెట్లలో ఎక్సీనోస్ 9810 ప్రాసెసర్
వెనుకవైపు డ్యూయల్ కెమెరా సిస్టమ్
ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా
యానిమేటెడ్ ఎమోజీలు, ఫేస్ అన్‌లాక్, పోట్రైట్ మోడ్
Comments
Please login to add a commentAdd a comment