న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ప్రమాదాల నేపథ్యంలో శాంసంగ్ సీనియర్ అధికారులు డీజీసీఏ అధికారులను కలిశారు. రెండురోజుల క్రితం ఇండిగో విమానంలో పొగలువ్యాపించిన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)అధికారులను శాంసంగ్ ప్రతినిధులు సోమవారం కలుసుకున్నారు. దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో ఏవియేషన్ రెగ్యులేటరీ గెలాక్సీ ఫోన్ల బ్యాటరీ పేలుళ్లు, ప్రమాదాలపై సాంకేతిక అంశాలు అడిగి తెలుసుకుంది. అలాగే 'గెలాక్సీ నోట్ 7' సెప్టెంబర్ 15 వరకూ తయారైన ఫోన్లను బ్యాటరీ సమస్యలు పరిష్కరించే చర్యల్లో భాగంగా దేశంలో ఈ మొబైల్స్ ను విక్రయించబోమని శామ్సంగ్ అధికారులు డీజీసీఏకు తెలిపినట్టు సమాచారం.
కాగా సింగపూర్ వస్తున్న ఇండిగో విమానం చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్ సందర్భంగా సెప్టెంబర్ 23 న ఒక శాంసంగ్ గెలాక్సీ నోట్ 2 స్మార్ట్ ఫోన్ ప్రమాదంతో పొగలు వచ్చిన ఘటన ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుడు ఘటనలు నమోదవుతున్నప్పటికీ , దేశంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం మొదటిసారి. దీంతోఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన డీజీసీఏ విమానాల్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల వాడకంపై మరోసారి నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీంతోపాటుఈ రోజు సమావేశానికి హాజరు కావాల్సిందిగా శాంసంగ్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సమావేశం గురించి వ్యాఖ్యానించడానికి , డీజీసీఏ అధికారులు అందుబాటులో లేరు. మరోవైపు శాంసంగ్ ప్రతినిధులు దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
డీజీసీఏ, శాంసంగ్ సమావేశం
Published Mon, Sep 26 2016 4:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
Advertisement
Advertisement