మోటో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ | Moto E7 Power India Launch Confirmed for February 19 | Sakshi
Sakshi News home page

మోటో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్

Published Mon, Feb 15 2021 6:10 PM | Last Updated on Mon, Feb 15 2021 6:33 PM

Moto E7 Power India Launch Confirmed for February 19 - Sakshi

మోటో ఈ7 పవర్ ను ఫిబ్రవరి 19న ఇండియాలో తీసుకొనిరానున్నట్లు మోటోరోలా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ హెలియో పీ22 ప్రాసెసర్ అందిస్తున్నట్లు ప్రకటించింది. మోటో ఈ7 పవర్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది. మోటో ఈ-సిరీస్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన మోటో ఈ7 ప్లస్‌కు కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. లెనోవా యాజమాన్యంలోని సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం మోటో ఈ7 పవర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

మోటో ఈ7 పవర్ స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.5 హెచ్‌డీ ప్లస్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ర్యామ్: 4జీబీ
స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్:  మీడియాటెక్ హెలియో పీ22
బ్యాక్ కెమెరా: 13 ఎంపీ + 2 ఎంపీ
సెల్ఫీ కెమెరా: 5 మెగాపిక్సెల్
ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement