లీకైన మోటో జీ స్టైలస్ ఫీచర్స్ | Motorola Moto G Stylus 2021 Edition Smartphone Features Leaked | Sakshi
Sakshi News home page

లీకైన మోటో జీ స్టైలస్ ఫీచర్స్

Published Sun, Jan 3 2021 6:54 PM | Last Updated on Sun, Jan 3 2021 7:09 PM

Motorola Moto G Stylus 2021 Edition Smartphone Features Leaked - Sakshi

ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీల మాదిరిగానే మోటరోలా కూడా ఈ ఏడాది తన కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా తన మార్కెట్ ను విస్తరించుకోవాలని చూస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం, మోటరోలా త్వరలో మోటో జీ స్టైలస్ 2021 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ 2020 మొదటి త్రైమాసికంలో ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్‌లో లాంచ్ చేసిన మోటో జీ స్టైలస్ వారసురాలుగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మాక్స్ విజన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.(చదవండి: అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?)

మోటో జీ స్టైలస్ 2021 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ మాక్స్ విజన్ డిస్‌ప్లే కలిగి ఉంది. మోటో జీ స్టైలస్ 2021 ఎడిషన్ వెనుకవైపు నాలుగు కెమెరాలతో వస్తుంది. 48 ఎంపీ మెయిన్ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. మోటో జీ స్టైలస్ 2021 స్నాప్‌డ్రాగన్ 675 చిప్‌సెట్‌తో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో పనిచేస్తుంది. ఇందులో 4000ఎంఏహెచ్ బ్యాటరీని తీయాసుకు రానున్నారు. దీనిలో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ తీసుకురావడం లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement