న్యూఢిల్లీ : కనుమరుగైన నోకియాను స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తిరిగి తీసుకొచ్చిన హెచ్‌ఎండీ గ్లోబల్ 2018లో మరిన్ని నోకియా స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే నెల 26 నుంచి బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ)లో కొత్త మోడళ్లను హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటించి అవకాశం ఉంది.
ఫ్లాగ్‌షిప్ ఫోన్ నోకియా 9 ప్రకటన..!
ఫ్లాగ్‌షిప్ ఫోన్ నోకియా 9ను హెచ్‌ఎండీ గ్లోబల్ ఎండబ్ల్యూసీ-2018లో ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హై ఎండ్ ఫీచర్స్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఐ ఫోన్, శాంసంగ్ గెలాక్సీ నోట్స్‌కు దీటుగా నోకియా దీన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం.
నోకియా-9 ఫీచర్లు
ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు
ఓఎల్‌ఈడీ స్క్రీన్(బెజెల్‌లెస్)
3,250 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇంటర్నట్ మెమరీ : 128 జీబీ
బూతీ ఎఫెక్ట్
ఓజెడ్‌ఓ ఆడియో ఫీచర్లు
Comments
Please login to add a commentAdd a comment