నోకియా బ్రాండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్ ఇటీవల దూకుడుగా ఉంది. ఫిబ్రవరిలోనే ఎండబ్ల్యూసీ 2018లో నోకియా 8(సిరోకో), నోకియా 7 ప్లస్, నోకియా 6 స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించిన హెచ్‌ఎండీ గ్లోబల్, మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. నోకియా 9 పేరుతో కొత్తగా తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను ఈ కంపెనీ విడుదల చేస్తోందని తెలుస్తోంది. స్లాష్‌లీక్స్ వివరాల ప్రకారం ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని హై-ఎండ్ స్పెషిఫికేషన్లు బయటికి లీకయ్యాయి.
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటున్నాయని, స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ చిప్‌సెట్‌ను ఇది కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డివైజ్ 6.1 అంగుళాల క్యూహెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండి, ముందు ఫోన్ల మాదిరి 18 క్యారెట్ల గోల్డ్ ఫిన్నిస్‌తో సిరామిక్ బ్లాక్ ప్లేటుతో అభివృద్ధి చెందుతుందని సమాచారం. స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ 845 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇది కలిగి ఉందని స్లాష్‌లీక్స్ చెబుతోంది. 41 ఎంపీ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, 20 ఎంపీ సెకండరీ టెలిఫోటో లెన్స్, 9.7 ఎంపీ మోనోక్రోమ్ కెమెరాలతో మూడు కెమెరా సెన్సార్లతో ఇది మార్కెట్లోకి రాబోతోందని తెలుస్తోంది. ముందు వైపు 21ఎంపీ సెన్సార్‌తో ఇది రూపొందుతోందని సమాచారం. 3900 ఎంఏహెచ్ బ్యాటరీ, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐపీ68 వాటర్ రెసిస్టెంట్, ఇన్-గ్లాస్ ఫింగర్‌ప్రింట్ రీడర్ దీనిలో ఉండబోతున్నాయట. ఫీచర్ల పరంగా టాప్ బ్రాండులకు పోటీగా హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్పెషిఫికేషన్లతో చాలా స్ట్రాంట్‌గా మార్కెట్‌లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment