
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా తన హవాను చాటుకునేందుకు మరో ఫ్లాగ్‌షిప్ కెమెరాతో సిద్ధమవుతోంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 'నోకియా 9' స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ 2019లో విడుదల లాంచ్ చేయనుంది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఏకంగా 5 కెమెరాలతో ఇది వినియోగదారుల ముందుకు రానుంది.
తాజాగా సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్) లో హల్ చల్ చేస్తున్న సమాచారం ప్రకారం 'నోకియా 9' స్మార్ట్‌ఫోన్ 5 రియర్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 9పై, గ్లాస్ బ్యాక్‌తో ఈ ఫోన్ రానుంది. మిగతా ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి.
6 ఇంచ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 845 సాక్
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
4150 ఎంఏహెచ్ బ్యాటరీ
అయితే కెమెరా ఉత్పత్తిలో సమస్య కారణంగా ఇప్పటివరకూ ఫోన్ విడుదలను వాయిదా వేస్తూ వచ్చిన సంస్థ కొత్త సంవత్సరంలో యూజర్లకు కొత్త ఏడాది కానుకగా 2019 ఆరంభంలో తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరపై సస్పెన్స్ వీడాలంటే లాంచింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment