ఐఫోన్లకే కాదు..ఇకపై నోకియా స్మార్ట్‌ఫోన్స్‌పై కూడా..! | Nokia Launches Applecare Like Protection Plans For Smartphones | Sakshi
Sakshi News home page

Nokia: ఐఫోన్లకే కాదు..ఇకపై నోకియా స్మార్ట్‌ఫోన్స్‌పై కూడా..! కొత్త ప్రణాళికతో..!

Published Wed, Feb 2 2022 3:52 PM | Last Updated on Wed, Feb 2 2022 4:01 PM

Nokia Launches Applecare Like Protection Plans For Smartphones - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం నోకియా కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్‌ తన ఉత్పత్తులకు అందించే యాపిల్‌కేర్‌+ తరహాలో స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రోటక్షన్‌​ ప్లాన్స్‌ను, వారంటీ ప్రొగ్రామ్‌ను నోకియా కూడా ప్రారంభించింది. దీంతో ఆయా నోకియా ఉత్పత్తులపై యూజర్లకు మరింత  భద్రత లభించనుంది. 

మరింత భద్రంగా మీ స్మార్ట్‌ఫోన్స్‌..!
నోకియా ఉత్పత్తులపై యాపిల్‌కేర్‌+ తరహాలో కొత్త ప్లాన్స్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ తీసుకొచ్చింది. అందుకోసం డివైజ్‌ మేనెజ్‌మెంట్‌​  ప్లాట్‌ఫాం సర్విఫైతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా నోకియా స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు వారంటీ పొడగింపు, స్క్రీన్‌ ప్రోటెక్షన్‌ లభించనున్నాయి. ఈ సెఫ్టీ ప్రణాళికలను భారత్‌, USలోని నోకియా ఫోన్ వినియోగదారుల కోసం ఈ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. .

ధరలు ఇలా..!
హెచ్‌ఎండీ గ్లోబర్‌ తీసుకొచ్చిన సరికొత్త ప్రోటెక్షన్‌ ప్లాన్‌ను స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన 30 రోజుల్లో ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అమెరికాలో 12 నెలల పొడిగించిన వారంటీ ప్లాన్ ధర దాదాపు రూ. 750గా ఉండగా, భారత్‌లో రూ. 349 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్లాన్స్‌ నిర్ణీత సమయం వరకు వర్తించనున్నాయి. హెచ్‌ఎండీ ప్రతిపాదించిన ఈ ప్లాన్స్‌ను భారత్‌లో Servify వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా పొందవచ్చును. అయితే ఆయా హ్యాండ్‌సెట్ ప్రకారం ప్రొటక్షన్‌ ప్లాన్ల ధరలు ఉంటాయి. ఈ ప్రోటక్షన్‌ ప్లాన్‌లో భాగంగా నోకియా స్మార్ట్‌ఫోన్స్‌  ప్రమాదవశాత్తు కింద పడితే, లిక్విడ్ డ్యామేజ్ వారంటీ గడువు ముగిసిన తర్వాత ఏర్పడే బ్రేక్‌ డౌన్స్‌ వంటి వాటికి కవరేజీ వస్తోంది. 

వారికి  మాత్రమే..!
ఇటీవల కొనుగోలుచేసిన నోకియా స్మార్ట్‌ఫోన్స్‌పై  మాత్రమే ఈ ప్రొటక్షన్‌ ప్లాన్‌ అందుబాటులో ఉండనుంది. ఫోన్‌ కొనుగోలుచేసిన 30 రోజులలోపు ఈ ప్రొటక్షన్‌ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి అర్హులు. ఈ మొత్తం ప్రక్రియకు 7 నుంచి 12 రోజుల సమయం పడుతుందని HMD పేర్కొంది. 

చదవండి:  తక్కువ ధరలో వన్‌ప్లస్‌ నుంచి మరో సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌..! ఫీచర్స్‌​ లీక్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement