
హెచ్‌ఎండీ గ్లోబల్ గత నెలలోనే నోకియా 105 ఫోన్‌తో పాటు నోకియా 130 ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వెంటనే కొత్త నోకియా 105 ఫోన్ రూ.999కే అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, కొత్త నోకియా 130 మాత్రం ఎప్పడి నుంచి అందుబాటులో ఉంటుంది, ఎంత ధరకు విక్రయించనుందో కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కొత్త నోకియా 130 ఫోన్ ధరను హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటించింది. అంతేకాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మొబైల్ రిటైల్ స్టోర్లలో దీన్ని అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. 1,599 రూపాయలకు లభ్యమయ్యే ఈ ఫోన్, మూడు రంగుల్లో మార్కెట్‌లోకి వచ్చింది. రెడ్, గ్రే, బ్లాక్ రంగుల్లో డ్యూయల్ సిమ్ వేరియంట్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది.