నోకియా 5.3 విక్రయాలు ప్రారంభం | Budget Phone Nokia 5.3 Sales Start Now | Sakshi
Sakshi News home page

నోకియా 5.3 విక్రయాలు ప్రారంభం

Published Wed, Sep 2 2020 8:59 AM | Last Updated on Wed, Sep 2 2020 9:11 AM

Budget Phone Nokia 5.3 Sales Start Now - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల నోకియా ఆవిష్కరించిన బడ్జెట్‌ ఫోన్‌ ‘‘నోకియా 5.3’’ అమ్మకాలు సెప్టెంబర్‌ 1న ప్రారంభమైనట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వైస్‌ చైర్మన్‌ సన్మీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఎఐతో శక్తివంతమైన క్వాడ్‌ కెమెరాను అందిచడంతో పాటు, స్నాప్‌ డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌పై పనిచేసే తొలి నోకియా ఫోన్‌ ఇది. ఈ పండుగ సీజన్లో నోకియా అభిమానులు దీన్ని సొంతం చేసుకునేందుకు సుముఖత చూపుతారని విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.

అమెజాన్, నోకియా.కామ్‌/ఫోన్‌ వెబ్‌సైట్లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. 4జీబీ ర్యామ్‌/64 జీబీ వేరియంట్‌ రూ.13,999గానూ, 6జీబీ ర్యామ్‌/ 64జీబీ వేరియంట్‌ ధర రూ.15,499గానూ ఉన్నాయి. జియో సబ్‌స్క్రైబర్లు ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.4వేల విలువైన ప్రయోజనాలను రూ.349 ప్లాన్లపై పొందగలరు. అలాగే రూ.2వేల క్యాష్‌ బ్యాంక్, రూ.2వేల విలువైన వోచర్లను జియో అందిస్తుంది. (నోకియా దూకుడు : నాలుగు స్మార్ట్‌ఫోన్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement