
నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది
సెల్ ఫోన్ వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోకియా తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్ తో పనిచేసే స్మార్ట్ ఫోన్ ను నోకియా మొదటిసారిగా మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ‘నోకియా 6’ పేరుతో తయారు చేసిన ఈ ఫోన్ ను హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన వెబ్ సైట్ ద్వారా విడుదల చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్ మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అయితే ‘నోకియా 6’ ఫోన్‌ను ఇతర దేశాల్లో విడుదల చేసే ఉద్దేశం లేదని హెచ్‌ఎండీ గ్లోబల్ తెలిపింది. ఆండ్రాయిడ్ ఓఎస్ తో పనిచేసే మరిన్ని స్మార్ట్ ఫోన్లను ఈ ఏడాది ప్రవేశపెడతామని వెల్లడించింది.
నోకియా 6 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు
ఫింగర్ ప్రింట్ స్కానర్
5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే
2.5 డి గొరిల్లా గ్లాస్
ఆండ్రాయిడ్ నోగట్ 7.0 ఓఎస్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ మెమొరీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
డ్యూయల్ సిమ్
కెమెరా: వెనక 16 మెగాపిక్సెల్స్, ముందు 8 మెగాపిక్సెల్స్
డ్యూయల్ ఆంప్లిఫైయర్స్
ధర: దాదాపు రూ. 16,750