అత్యంత చౌకైన నోకియా ఫోన్‌.. రేపే లాంచింగ్‌ | Nokia's cheapest Android phone might launch tomorrow | Sakshi

అత్యంత చౌకైన నోకియా ఫోన్‌.. రేపే లాంచింగ్‌

Oct 30 2017 12:41 PM | Updated on Oct 31 2017 12:09 PM

Nokia's cheapest Android phone might launch tomorrow

హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఆధ్వర్యంలో నోకియా బ్రాండ్‌ రీ-లాంచ్‌ అయిన తర్వాత కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్‌ ఫోన్లతో ఫిన్నిష్‌ కంపెనీల అలరిస్తోంది. ఇప్పటి వరకు నోకియా లాంచ్‌ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్ల కంటే చౌకగా.. దేశీయ మార్కెట్‌లోకి మరో కొత్త నోకియా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయాలని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ డివైజ్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా భారత్‌లోనే విడుదల చేయాలని చూస్తోంది. ఈ ఫోన్‌ లాంచింగ్‌ షెడ్యూల్‌ కూడా రేపే(అక్టోబర్‌ 31నే) ఉంటుందని, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దీన్ని ఉదయం 11.30 నిమిషాలకు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ లాంచింగ్‌ గురించి కంపెనీ ఎలాంటి విషయాలు రివీల్‌ చేయనప్పటికీ, నోకియా స్మార్ట్‌ఫోన్లలో తాము తర్వాత తీసుకురాబోతున్న డివైజ్‌ మాత్రం ఓ మైలురాయి అని అభివర్ణించింది. దీని ఖరీదు షావోమి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మాదిరి రూ.6000గా ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.

అంటుటు బెంచ్‌మార్కు టెస్ట్‌ ఈ డివైజ్‌ వివరాలను లీక్‌ చేసేసింది. ఈ లీక్‌ల ప్రకారం ఈ నోకియా డివైజ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌, 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌,  హెచ్‌డీ స్క్రీన్‌, 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.1.1, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉండబోతుందని తెలిసింది. ఈ డివైజ్‌ పేరు నోకియా 2గా పేర్కొంది. నోకియా 2తో పాటు హెచ్‌ఎండీ గ్లోబల్‌ రేపు మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో నోకియా 7ను కూడా లాంచ్‌ కాబోతుందట. ఈ డివైజ్‌ ఈ నెల మొదట్లోనే చైనాలో లాంచ్‌ అయింది. నోకియా 7 ఫీచర్లు... క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 చిప్‌సెట్‌, 4జీబీ, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లు, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌,  5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌, 3డీ కర్వ్‌డ్‌ గ్లాస్, ‌16 ఎంపీ ప్రైమరీ కెమెరా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement