సాక్షి, ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లో నాలుగు కొత్త నోకియా స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3, రెండు ఫీచర్ ఫోన్లు నోకియా 125, నోకియా 150 లను ఆవిష్కరించింది. 5.1కి కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది.
నోకియా 5.3 ఫీచర్లు
6.55-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే
5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్సెట్
4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్
6 జీబీ ర్యామ్ , 64 జీబీ స్టోరేజ్
13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ
ధర
4 జీబీ ర్యామ్ బేస్ వేరియంట్‌కు రూ .13,999
6 జీబీ ర్యామ్ మోడల్‌కు రూ .15,499.
సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఆఫర్లు
రూ .349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై రిలయన్స్ జియో నుంచి రూ .4 వేల విలువైన ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో 2,000 రూపాయల క్యాష్‌బ్యాక్ , 2,000 రూపాయల విలువైన వోచర్లు ఉన్నాయి.
నోకియా సీ 3 ఫీచర్లు
5.99అంగుళాల డిస్ప్లే
720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10
2 జీబీ/3 జీబీ ర్యామ్, 16 జీబీ/32 జీబీ స్టోరేజ్
128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3.5 మిమీ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో
3040 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర
సెప్టెంబర్ 17 నుండి నోకియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ చెయిన్ ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉంటుంది.
2 జీబీ / 16 జీబీ వేరియంట్ ధర 7,499 రూపాయలు
3 జీబీ / 32 జీబీ వేరియంట్ 8,999 రూపాయలు
ఒక సంవత్సరం రీప్లేస్ మెంట్ గ్యారంటీ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment