
స్మార్ట్‌ఫోన్ వ్యాపారాల్లోకి నోకియా గతేడాది జనవరి 1కి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2017లో మార్కెట్‌లోకి పునఃప్రవేశమైన తర్వాత నోకియా బ్రాండులో బడ్జెట్, ప్రీమియం సెగ్మెంట్లలో పలు స్మార్ట్‌ఫోన్లు వినియోగదారుల ముందుకు వచ్చాయి. 2018లో కూడా 2017 వ్యూహాన్నే పాటించనున్నట్టు హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటించింది. ప్రస్తుతం హెచ్‌ఎండీ గ్లోబల్ హైఎండ్ ఫోన్ నోకియా 9పై పనిచేస్తుందని, నోకియా 6(2018), ఆండ్రాయిడ్ గో-ఆధారిత నోకియా 1ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా నోకియా 4, మరో హైఎండ్ ఎడిషన్ నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను కూడా లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. నోకియా కెమెరా యాప్ ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ధృవీకరించినట్టు గిమోచైనా రిపోర్టు పేర్కొంది.
నోకియా అతిపెద్ద వెర్షన్‌లో, స్నాప్‌డ్రాగన్ 660తో రూపొందుతుందని ఈ కెమెరా యాప్ పేర్కొంది. నోకియా 4 గురించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు. ఈ ఏడాది లాంచ్ చేసేందుకు ఐదు కొత్త స్మార్ట్‌ఫోన్లపై హెచ్‌ఎండీ గ్లోబల్ పనిచేస్తుందని కూడా ఈ నోకియా కెమెరా యాప్ ధృవీకరించింది. ముందస్తు రిపోర్టుల ప్రకారం నోకియా 6(2018), నోకియా 1 ఫోన్లతో నోకియా 9ను హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటిస్తుందని తెలిసింది. నోకియా 4, నోకియా 7 ప్లస్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది. హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌గా రాబోతున్న నోకియా 9, 5.5 అంగుళాల ఓలెడ్ ప్యానల్, బెజెల్ లెస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835, 3,250 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వెనుకవైపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉండబోతుంది..
Comments
Please login to add a commentAdd a comment