భారత్‌లోనే నోకియా ఫోన్ల తయారీ!
బార్సిలోనా: నోకియా బ్రాండ్ మార్కెటింగ్ అధికారాలను పదేళ్ల కాలానికి చేజిక్కించుకున్న హెచ్‌ఎండీ గ్లోబల్.. నోకియా–3310తో సహా ఇతర అన్ని నోకియా ఫోన్లను భారత్‌లోనే తయారు చేయనుంది. తమ అన్ని ప్రొడక్టులను ఇండియాలోనే తయారు చేయాలని భావిస్తున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజయ్ మెహ్‌తా తెలిపారు.
కంపెనీ 4జీ ఫీచర్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిందని పేర్కొన్నారు. అందుబాటులోని అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, భారత్ తమకు ప్రధాన మార్కెట్ అని తెలిపారు. ఫాక్స్‌కాన్ కంపెనీ హెచ్‌ఎండీ గ్లోబల్‌కు తయారీ భాగస్వామిగా ఉంది. కాగా కంపెనీ పలు ఆండ్రాయిడ్ ఫోన్లతోపాటు ఐకానిక్ నోకియా–3310 ఫోన్‌ను ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో మార్కెట్‌లోకి తీసుకురానున్నది.