Toyota Company
-
తగ్గేదేలే అంటున్న కార్ల అమ్మకాలు.. తొలి నెలలోనే అదరగొట్టారు
ముంబై: కొత్త క్యాలండర్ ఏడాది(2023) తొలి నెలలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజాలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీకేఎం, కియా ఇండియా, హ్యుందాయ్ జనవరిలో పటిష్ట విక్రయాలను సాధించాయి. అయితే ఎంజీ మోటార్, హోండా మాత్రం వాహన విక్రయాలలో వెనకడుగు వేశాయి. మారుతీ 12 శాతం అధికంగా 1,72,535 వాహనాలను విక్రయించగా.. ఎంఅండ్ఎం 37 శాతం వృద్ధితో 64,335 వాహనాలను అమ్మింది. ఈ బాటలో టాటా మోటార్స్ అమ్మకాలు సైతం 6 శాతం పుంజుకుని 81,069 వాహనాలకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) అమ్మకాలు 175 శాతం జంప్‌చేసి 12,835 యూనిట్లను తాకాయి. కియా ఇండియా అమ్మకాలు 48 శాతం మెరుగుపడి 28,634 యూనిట్లకు చేరగా.. హ్యుండాయ్ మోటార్ ఇండియా 17 శాతం అధికంగా 62,276 వాహనాలను విక్రయించింది. చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
కొత్త రకం ఇన్నోవా, ఫార్చునర్
న్యూఢిల్లీ: టయోటా కంపెనీ ఇన్నోవా మోడల్లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త ఇన్నోవా వేరియంట్ ధరలు రూ.10.51 లక్షల నుంచి రూ.15.80 లక్షల(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)రేంజ్లో ఉన్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్,మార్కెటింగ్) ఎన్.రాజా తెలిపారు. ‘ఇన్నోవా మోడల్‌ను తెచ్చి పదేళ్లయింది. ఈ పదేళ్లుగా ఇన్నోవా విజయయాత్ర కొనసాగుతోంది. కొత్త రకాన్ని తేవటమనేది అనుకోకుండా జరిగింది. ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) ఫార్చునర్(4ఇంటూ4 ఆటోమేటిక్)లో కూడా కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చాం’ అని రాజా వివరించారు. ఈ ఎస్యూవీ ధర రూ.24.17 లక్షల నుంచి రూ.26.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు కార్లు భారత ఆటోమొబైల్ చరిత్రలో ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయని పేర్కొన్నారు. తమ అన్ని మోడళ్లలో ఫ్రంట్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్‌ను అందిస్తున్నామని, ఇలా అందిస్తున్న తొలి కంపెనీ తమదేనని చెప్పారు. -
టయోటా ‘స్పెషల్’ ఎతియోస్
పెట్రోల్ కారు @ రూ.5.98 లక్షలు డీజిల్ కారు @ రూ.7.10 లక్షలు న్యూఢిల్లీ: టయోటా కంపెనీ మిడ్-సైజ్ సెడాన్ మోడల్, ఎతియోస్‌లో స్పెషల్ ఎడిషన్, ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమని టయోటా కిర్లోస్కర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)ఎన్. రాజా చెప్పారు, 900 కార్లను మాత్రమే అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్ ధర రూ.5.98 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ.7.10 లక్షలు (ఈ రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని వివరించారు. బుకింగ్స్ గురువారం నుంచి ప్రారంభించామని, ఈ నెల 11 నుంచి కార్లను డెలివరీ చేస్తామని చెప్పారు. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎతియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను రూపాందించామని వివరించారు. భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ఎతియోస్ మోడల్‌ను 2010లో మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 2 లక్షల కార్లను విక్రయించామని పేర్కొన్నారు. ఈ కారును కుడి చేతి డ్రైవింగ్ మార్కెట్లైన దక్షిణాఫ్రికా, శ్రీలంక, మారిషస్, జింబాబ్వే, సీషెల్స్, నేపాల్, భూటాన్, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో కూడా విక్రయిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. 100 శాతం ఫైనాన్స్... టయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండానే ఏడేళ్ల కాలానికి వంద శాతం కారు రుణం అందిస్తున్నామని కంపెనీ తెలిపింది.