సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో ని శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్ లో కొత్త వేరియంట్ (16జీబీ)ను ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.10,999గా నిర్ణయించింది. అయితే ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 3 -5 మధ్య బొనాంజా సేల్స్‌లో విక్రయించనుంది. ఈ పరిమిత కాల ఆఫర్‌లో రూ.9,999కే అందిస్తోంది. కాగా 2016లో గెలాక్సీ ఆన్ నెక్ట్స్ 32జీబీ వెర్షన్‌ను లాంచ్ చేసింది.
గెలాక్సీ ఆన్ నెక్ట్స్ ఫీచర్స్
5.5 అంగుళాల డిస్‌ప్లే
2.5డి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1.5 ఆక్టాకోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
256దాకా విస్తరించుకునే సదుపాయం
13 మెగా పిక్సెల్ కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
Comments
Please login to add a commentAdd a comment