శాంసంగ్ ఎస్ 7 ఎడ్జ్ కొత్త వేరియంట్...ధర ఎంత?
న్యూఢిల్లీ: ప్రముఖ మొంబైల్ ఫోన్ మేకర్ శాంసంగ్ హై ఎండ్ కేటగిరీకి చెందిన స్మార్ట్ ఫోన్ లో మరో వేరియంట్ ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పటికే విడుదల చేసిన శాంసంగ్ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ను సోమవారం విడుదల చేసింది. ఇటీవల ఇండియాలో పింక్ గోల్డ్ కలర్ లాంచ్ చేసిన ఈ సౌత్ కొరియా కంపెనీ తాజాగా బ్లాక్ పియర్ కలర్ వేరియంట్ ను ప్రవేశపెట్టింది. అయితే పింక్ కలర్ వేరియంట్ ధరలో మార్పు చేయనప్పటికీ బ్లాక్ పెర్ల్ కలర్ ధరను మాత్రం రూ.56,900గా నిర్ణయించింది. డిసెంబర్ 30 నుంచి వీటిని వినియోగదారులకు అందించనున్నట్టు తెలిపింది.
ఈ ఫోను ఫీచర్ల విషయానికొస్తే మెమొరీ పరంగా పింక్ కలర్ లో 64 జీబీ అంతర్గత సామర్ధ్యం ఉండగా తాజా వేరియంట్ లో 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ అందిస్తోంది.
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ల ప్లే
1440x2560 రిజల్యూషన్
4 జీబీ ర్యామ్
12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3600ఎంఏహెచ్ బ్యాటరీ