Galaxy S7 Edge
-
హైఎండ్ శాంసంగ్ ఫోన్‌పై ధర తగ్గింపు
హైఎండ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌పై భారత్‌లో ధర తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఆరు వేల రూపాయల మేర ధర తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ 32జీబీ వేరియంట్ రూ.35,900కు, 128జీబీ వెర్షన్ రూ.37,900కు అందుబాటులోకి వచ్చాయి. ఆఫ్‌లైన్ ఛానల్స్‌లో మాత్రమే ఈ తగ్గింపుతో గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. శాంసంగ్ ఆన్లైన్ స్టోర్‌లో కేవలం 32జీబీ వేరియంట్‌పై మాత్రమే ధర తగ్గింది. 128జీబీ వేరియంట్ పాత ధరకే లభ్యమవుతోంది. 2016 ఆగస్టులో ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ వేరియంట్ ధర 50,900 రూపాయలు, 128జీబీ వేరియంట్ ధర 56,900 రూపాయలు ఉంది. అనంతరం ఈ ఇరు వేరియంట్లపై కూడా ధర తగ్గించి రూ.41,900కు, రూ.43,900కు శాంసంగ్ అందుబాటులోకి తెచ్చింది. మరోసారి ప్రస్తుతం వీటిపై ఆరు వేల రూపాయల మేర ధర తగ్గించింది. ఆశ్చర్యకరంగా గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ ధరలు తగ్గించిన అనంతరం వెంటనే హైఎండ్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌పై కూడా ధర శాంసంగ్ ధర తగ్గించింది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌ను ఎండ్ల్యూసీ 2016లో శాంసంగ్ లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫీచర్లు.. ఆండ్రాయిడ్ నోగట్ 5.5 అంగుళాల క్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లే ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 8890 ఎస్ఓసీ 4జీబీ ర్యామ్ 12 ఎంపీ డ్యూయల్ పిక్సెల్ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 200టీబీ వరకు విస్తరణ మెమరీ 3600ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ ఇండిపెండెన్స్ సేల్: భారీ ఆఫర్
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోతవ్సం సందర్భంగా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తన స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై బిగ్ డిస్కౌంట్లు, క్యాఫ్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ పై ఈ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు రూ.20వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది శాంసంగ్ ఇండిపెండెన్స్ సేల్ లో భాగంగా, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్‌పై రూ. 8వేల క్యాష్ బ్యాక్ ( 64 జీబీ,128జీబీ రెండు వేరియంట్లు). దీనితో పాటు, ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ .12,000 వరకు అదనపు క్యాష్ బ్యాక్ లభ్యం. గాలక్సీ ఎస్ 7 ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు రూ .4వేల క్యాష్ బ్యాక్. రూ.12వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్. అంతేకాదు ఈ స్వాతంత్ర్య దినోత్సవ అమ్మకాలల్లో భాగంగా రెండు ఫోన్లపై 24 నెలల వరకు ఈఎంఐ ఆఫర్. కాగా గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఇప్పటికీ శాంసంగ్ బెస్ట్ స్మార్ట్ఫోన్లుగా పరిగణించబడుతున్నాయి. ఈ ఫోన్లు గత ఏడాది ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్ 7 రూ .48,900, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రూ .56,900 ధరలతో లాంచ్ అయ్యాయి. -
శాంసంగ్ ఎస్ 7 ఎడ్జ్ కొత్త వేరియంట్...ధర ఎంత?
న్యూఢిల్లీ: ప్రముఖ మొంబైల్ ఫోన్ మేకర్ శాంసంగ్ హై ఎండ్ కేటగిరీకి చెందిన స్మార్ట్ ఫోన్ లో మరో వేరియంట్ ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పటికే విడుదల చేసిన శాంసంగ్ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ను సోమవారం విడుదల చేసింది. ఇటీవల ఇండియాలో పింక్ గోల్డ్ కలర్ లాంచ్ చేసిన ఈ సౌత్ కొరియా కంపెనీ తాజాగా బ్లాక్ పియర్ కలర్ వేరియంట్ ను ప్రవేశపెట్టింది. అయితే పింక్ కలర్ వేరియంట్ ధరలో మార్పు చేయనప్పటికీ బ్లాక్ పెర్ల్ కలర్ ధరను మాత్రం రూ.56,900గా నిర్ణయించింది. డిసెంబర్ 30 నుంచి వీటిని వినియోగదారులకు అందించనున్నట్టు తెలిపింది. ఈ ఫోను ఫీచర్ల విషయానికొస్తే మెమొరీ పరంగా పింక్ కలర్ లో 64 జీబీ అంతర్గత సామర్ధ్యం ఉండగా తాజా వేరియంట్ లో 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ అందిస్తోంది. 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ల ప్లే 1440x2560 రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్ 12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3600ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎస్7 తయారీ ఖర్చు మరీ అంతతక్కువా?
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్ఫోన్లు కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా అమ్మకాలు జరిగి రికార్డు సృష్టించాయి. అయితే ఈ మొబైల్స్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 సిరీస్ మొబైల్స్ తయారీ కోసం కేవలం రూ.16 వేలు మాత్రమే ఖర్చుచేస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. మార్కెట్లో కొన్ని సర్వేలలో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 వెర్షన్ ఉన్న ఎస్ 7 కోసం 255 డాలర్లు(భారత కరెన్సీలో కేవలం రూ. 15,750) అవుతుందట. సాఫ్ట్ వేర్ రీసెర్చ్, ఆర్ అండ్ డీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, పన్నులు ఇతర రకాల అలవెన్సులు ఇందుకు అధనం అని మార్కెట్ అనలిస్ట్ ఐహెచ్ఎస్ సర్వేలో తేలింది. గెలాక్సీ ఎస్7 ధర రూ.48,900 ఉండగా, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.56,900 లతో శాంసంగ్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే, గెలాక్సీ ఎస్ 7 ప్రొడక్ట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు గెలాక్సీ ఎస్5 కంటే ఒక డాలర్ (దాదాపు రూ.70) తక్కువ పడుతుందట. గెలాక్సీ ఎస్5 మార్కెట్లోకి వచ్చిఇప్పటికీ రెండేళ్లు అవుతుంది. ఆపిల్ ఉత్పత్తులను పూర్తిగా అధిగమించి విక్రయాలను చేయాలని కసరత్తులు చేస్తోంది. బార్సిలోనాలో గత నెలలో ప్రవేశపెట్టిన ఈ మొబైల్స్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ మొబైల్స్ వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఓపెన్ మార్కెట్లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. -
అప్పుడే లక్ష ఫోన్ల అమ్మకాలు!
సియోల్: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్ఫోన్లు కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా అమ్ముడుపోయాయని సంస్థ తెలిపింది. గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ హ్యాండ్ సెట్స్ శుక్రవారం 60 వేలు, శనివారం 40 వేలకు పైగా విక్రయాలు జరిగాయని ఓ అధికారిక సైట్ లో వివరాలు అప్ డేట్ చేశారు. ఈ రెండు రకాల హ్యాండ్ సెట్స్ గత నెలలో స్పెయిన్ లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ మొబైల్స్ పై స్మార్ట్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఈ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గెలాక్సీ ఎస్7 ధర రూ.48,900 ఉండగా, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.56,900 లతో శాంసంగ్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్లను మంగళవారం భారత మార్కెట్లోకి ఆ కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ఫోన్లు 32 జీబీ, 64 జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఉండనున్నాయి. ఇవి వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. మార్చి 8-18 మధ్యకాలంలో ప్రి-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ వర్చువల్ రియాలిటీ(వీఆర్)ను ఉచితంగా అందిస్తోంది. కాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఓపెన్ మార్కెట్లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. -
ఎస్7, ఎస్7 ఎడ్జ్ వచ్చేశాయి.. రెటెంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రఖ్యాత మొబైల్ కంపెనీ శామ్సంగ్ మంగళవారం భారత్ మార్కెట్లో తన కొత్త మోడళ్లైన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్‌లను లాంచ్ చేసింది. తన ఫ్లాగ్షిప్ మోడళ్లయిన ఈ రెండు ఫోన్లను ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లాంఛనంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో గెలాక్సీ ఎస్7 (32 జీబీ) రూ. 48,900, ఎస్7 ఎడ్జ్ (32 జీబీ) రూ. 56,900లకు లభించనున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను ప్రతిష్టాత్మక ఫీచర్లతో అందిస్తున్నట్టు కంపెనీ చెపుతోంది. ఈ కొత్త మోడళ్ల డిస్ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుందని, అలాగే తొలిసారి ఈ మొబైళ్లలో డుయల్ పిక్సల్ కెమెరాను వాడినట్టు శామ్సంగ్ తెలిపింది. గెలాక్సీ ఎస్7 త్రీడీ గ్లాస్ మెటల్ బాడీతో వస్తుంది. దీనిలో 5.1 క్యూహెచ్డీ డిస్ప్లే ఉంటుంది. ఇక ఎస్7 ఎడ్జ్ లో 5.5 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్లలోనూ 12 మెగా పిక్సల్ డుయల్ రియర్ లెన్స్ ఉంటాయి. ఈ తాజా మోడళ్ల స్పెషాలిటీ ఏమిటంటే వీటి మెమరీ స్టోరేజీని బాగా ఎక్స్పాండ్ చేసుకునే వీలుండటం. ఈ రెండు ఫోన్లలోనూ మైక్రో ఎస్డీ కార్డ్ మెమరీ 200 జీబీ వరకు పెంచుకోవచ్చు. కొన్ని దేశాల్లో ఈ మెమరీ ట్రేను డ్యూయల్ సిమ్గా కూడా వాడుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. అలాగా ఈ రెండు కొత్త ఫోన్ల ర్యామ్ సామర్థ్యాన్ని 3జీబీ నుంచి 4 జీబీకి పెంచింది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ అయిన ఈ రెండు ఫోన్లలో గెలాక్సీ ఎస్-7 బ్యాటరీ సామర్థ్యం 3000ఎంఏఎహ్ కాగా, ఎస్7 ఎడ్జ్ బ్యాటరీ పవర్ 3600ఎంఏహెచ్. బ్లాక్ షప్పైర్, గోల్డ్ ప్లాటినమ్, సిల్వర్ టైటానియం రంగుల్లో మూడు వేరియంట్లలో లభించే ఈ ఫోన్లు ఈ నెల 18 నుంచి మార్కెట్లో అమ్మనున్నారు.