శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ సేల్‌: భారీ ఆఫర్‌ | Samsung Independence Day sale: Up to Rs 20,000 off on Galaxy S7, Galaxy S7 Edge and more | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ సేల్‌: భారీ ఆఫర్‌

Published Tue, Aug 1 2017 6:34 PM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ సేల్‌: భారీ ఆఫర్‌

శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ సేల్‌: భారీ ఆఫర్‌

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోతవ్సం సందర్భంగా మొబైల్‌ దిగ్గజం  శాంసంగ్ తన  స్మార్ట్‌ఫోన్లపై భారీ  ఆఫర్లను ప్రకటించింది.   శాంసంగ్‌  స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లపై బిగ్‌ డిస్కౌంట్లు, క్యాఫ్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది.   ముఖ్యంగా  గెలాక్సీ ఎస్‌ 7,  గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్ పై ఈ ఆఫర్లను ప్రకటించింది.  దాదాపు రూ.20వేల దాకా తగ్గింపును అందిస్తోంది.  ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌  రెండింటిలోనూఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది

శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ సేల్‌ లో  భాగంగా, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్‌పై  రూ. 8వేల   క్యాష్‌ బ్యాక్‌ ( 64 జీబీ,128జీబీ రెండు వేరియంట్లు). దీనితో పాటు,  ఎక్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ .12,000 వరకు అదనపు క్యాష్ బ్యాక్  లభ్యం.  గాలక్సీ ఎస్ 7 ను కొనుగోలు చేయాలనుకుంటున్న  వినియోగదారులకు రూ .4వేల  క్యాష్‌ బ్యాక్‌.  రూ.12వేల దాకా ఎక్సేంజ్‌ ఆఫర్‌.  అంతేకాదు ఈ స్వాతంత్ర్య దినోత్సవ అమ్మకాలల్లో భాగంగా  రెండు ఫోన్లపై 24 నెలల వరకు  ఈఎంఐ ఆఫర్‌.

 కాగా గెలాక్సీ ఎస్‌ 7,  గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్  ఇప్పటికీ శాంసంగ్‌ బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లుగా పరిగణించబడుతున్నాయి.  ఈ ఫోన్లు గత ఏడాది ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్‌ 7  రూ .48,900, గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్ రూ .56,900 ధరలతో లాంచ్‌ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement