Independence Day sale
-
గుడ్ న్యూస్: రూ. 1515కే విమాన టికెట్, ఫ్రీ ఫ్లైట్ వోచర్ కూడా!
SpiceJet I-Day Sale: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ఇండిపెండెన్స్ డే సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. "ప్రత్యేక ఇన్క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్" పేరుతో స్పెషల్ సేల్ ప్రకటించింది. దీని ప్రకారం ఆగస్ట్ 14నుంచి ఎంపిక చేసిన దేశీయ డైరెక్ట్ వన్-వే ఫ్లైట్లలో ఈ సేల్ రూ.1,515 నుండి ప్రారంభమవుతుంది. అలాగే రూ. 2,000 వరకు ఉచిత విమాన వోచర్లను పొందవచ్చు. అంతేకాదు రూ. 15కే నచ్చిన సీటు ఎంపిక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఆగస్ట్ 14- ఆగస్ట్ 20 వరకు అందుబాటులో ఉండే ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లో భాగంగా కేవలం రూ. 1515కే (వన్ వే టికెట్) విమాన టికెట్నుకొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్రీ ఫ్లైట్ వోచర్, రూ. 15కే సీటు సెలెక్షన్ వంటి సర్వీసులు అందిస్తోంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్ట్ 15 నుంచి 2024 మార్చి 30 వరకు ప్రయాణించవచ్చు. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) లాభాలు జంప్ మరోవైపు బలమైన విమాన ప్రయాణ డిమాండ్ కారణంగా స్పైస్‌జెట్ జూన్‌తో ముగిసినతొలి త్రైమాసికంలో రూ. 205 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 789 కోట్ల నష్టాలను నమోదు చేసింది. దేశీయంగా ఉన్న డిమాండ్ కారణంగా 90 శాతం నమోదు చేసింది. మొత్తం నిర్వహణ ఆదాయం క్షీణించింది. అంతకుముందు సంవత్సరంఇదే త్రైమాసికంలో రూ. 2,457 కోట్లతోపోలిస్తే ఆదాయం రూ. 2,002 కోట్లుగా ఉంది. ఎబిట్టా మార్జిన్ 525 కోట్లుగా ఉన్నాయి. (టమాట భగ్గు: 15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం) -
ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్ డే’ సేల్
ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్ డే’ సేల్‌ను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లలో విమాన టిక్కెట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఎయిరిండియా తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఎయిరిండియా ఈ కొత్త ఆఫర్ కేవలం ఆన్లైన్ బుకింగ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఎవరైతే క్యారియర్ బుకింగ్ వెబ్సైట్ ఎయిరిండియా.ఇన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకుంటారో వారికి లభ్యం కానుంది. 2018 ఆగస్టు 15 వరకు ఈ సేల్ వాలిడ్‌లో ఉంటుంది. భారత్ పరిధిలో ప్రయాణం చేసేందుకే ఈ ఆఫర్ వర్తించనుందని ఎయిరిండియా తెలిపింది. ఈ డిస్కౌంట్‌ను పొందడానికి కస్టమర్లు ప్రోమో కోడ్ బాక్స్‌లో 18ఐఎన్‌డీఏఐ ప్రోమోకోడ్‌ను నమోదు చేయాల్సి ఉంది. ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్ వివరాలు.. ఈ ఆఫర్లో ఎలాంటి నోటీసులు లేకుండా విమాన టిక్కెట్ ధరలు మారనున్నాయి. ఈ స్కీమ్‌కు ఫేర్ కండీషన్స్‌ను అప్లయ్ అవుతాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు, అలియెన్స్ ఎయిర్ ఫ్లైట్స్, కోడ్ షేర్ ఫ్లైట్స్‌కు ఈ డిస్కౌంట్ వర్తించదు. పరిమిత వ్యవధిలోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఎయిరిండియా ప్రత్యర్థి జెట్ ఎయిర్వేస్ కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ, జాతీయ విమాన టిక్కెట్లపై ‘ఫ్రీడం ఫేర్స’ అనే సేల్‌ను ప్రకటించింది. గోఎయిర్ కూడా 10 లక్షల వరకు సీట్లను రూ.1099కే విక్రయిస్తోంది. #FlyAI : Celebrate #IndependenceDay with #AirIndia and avail attractive discounts across our network. For details, pl visit https://t.co/FVMhfFHund pic.twitter.com/wijZQaD84p — Air India (@airindiain) August 9, 2018 -
ఇండిపెండెన్స్ డే సేల్ : స్మార్ట్ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇండిపెండెన్స్ డే సేల్‌ను ప్రకటించింది. ఇండిపెండెన్స్ డేకి ముందుగా ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు అందిస్తున్నట్టు పేర్కొంది. శాంసంగ్ ఇండిపెండెన్స్ డే సేల్ కింద టీవీలు, అప్లియెన్స్, వేరబుల్స్, ఆడియో యాక్ససరీస్‌పై కూడా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర ఆఫర్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఆగస్టు 1 నుంచి మొదలైన ఈ సేల్ ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్, పేటీఎం నుంచి ప్రొడక్ట్‌లు కొనుగోలు చేసే కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ షాపులో 4 వేల రూపాయల తగ్గింపులో రూ.64,990కు అందుబాటులో ఉంది. అదనంగా గెలాక్సీ ఎస్9ప్లస్ కస్టమర్లకు రూ.3000 ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.6000 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ కంపెనీలు కూడా ఆఫర్లను అందిస్తున్నాయి. ఎంపిక చేసిన మొబైల్స్‌పై అదనంగా రూ.6000 ఎక్స్చేంజ్ వాల్యు అందుబాటులో ఉంది. శాంసంగ్ ఇండిపెండెన్స్ డే సేల్‌లో గెలాక్సీ ఎస్9 స్మార్ట్‌ఫోన్ ధర రూ.57,900 నుంచి ప్రారంభమవుతుంది. ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ, 256జీబీ వేరియంట్‌పై రూ.6000 ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్, 64జీబీ మోడల్‌పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. అదనంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుదారులకు రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ కంపెనీలు కూడా గెలాక్సీ ఎస్9పై ఆఫర్లను అందిస్తున్నాయి. గెలాక్సీ ఆన్ మ్యాక్స్, గెలాక్సీ ఆన్7 ప్రైమ్(64జీబీ వేరియంట్), గెలాక్సీ ఆన్ నెక్ట్స్(64జీబీ వేరియంట్), గెలాక్సీ ఆన్7 ప్రొ, గెలాక్సీ జే3 ప్రొ, గెలాక్సీ ఆన్5 ప్రొ, గెలాక్సీ ఆన్5లు ఆఫర్లలో అందుబాటులో ఉన్నాయి. మిగతా అన్ని స్మార్ట్ఫోన్లపై కూడా డిస్కౌంట్ ధరలను శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. -
పేటీఎం ఇండిపెండెన్స్ డే సేల్: భారీ క్యాష్‌బ్యాక్‌లు
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు తమ బంపర్ డిస్కౌంట్ సేల్స్‌ను ప్రకటించిన అనంతరం.. మీకంటే మీమేమనా తక్కువా అని పేటీఎం మాల్ కూడా భారీ డీల్స్‌ను ప్రకటించింది. ఇండిపెండెన్స్ డేకి ముందస్తుగా పేటీఎం మాల్ తన యాప్, వెబ్సైట్లో స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. మంగళవారం నుంచి అంటే ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, అప్లియెన్స్, అప్పీరల్స్, యాక్ససరీస్ వంటి అన్ని ఉత్పత్తులపైనా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను, డిస్కౌంట్లను అందించనున్నట్టు ఈ మాల్ వెల్లడించింది. ఈ సేల్ సందర్భంగా ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు, ఇంకా 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో అతిపెద్ద హైలెట్, ఐఫోన్ 7పై 8000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయడం. అంతేకాక ఐఫోన్ ఎస్ఈపై కూడా ఫ్లాట్ 15 శాతం డిస్కౌంట్, రూ.3000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం అందిస్తోంది. దీంతో 27,200 రూపాయలుగా ఉన్న ఐఫోన్ ఎస్ఈ ధర 19,990కి దిగొచ్చింది. అంతేకాక షాపింగ్ ఓచర్లను, అదనంగా 5000 రూపాయల విలువ గల క్యాష్‌బ్యాక్ ఓచర్లను అందిస్తోంది. వీటిని విమానాలు, అప్పీరల్స్, మొబైల్ యాక్ససరీస్‌పై వాడుకోవచ్చు. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్లు రూ.3000, రూ.3500 క్యాష్‌బ్యాక్‌లతో పేటీఎం మాల్లో లిస్టయ్యాయి. షావోమి ఇటీవల లాంచ్‌చేసిన ఎంఐ మ్యాక్స్ 2 కూడా పేటీఎం తన మాల్లో అందుబాటులో ఉంచింది. లెనోవో, మైక్రోమ్యాక్స్, వివో స్మార్ట్ఫోన్లపై కనీసం 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇక ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే, ఆపిల్, హెచ్‌పీ, లెనోవో బ్రాండ్లపై రూ.20వేల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు పేటీఎం మాల్ చెప్పింది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 13 అంగుళాల దానిపై ఫ్లాట్ రూ.10వేల క్యాష్‌బ్యాక్, లెనోవో ఐడియాప్యాడ్ 320పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌లను పేటీఎం లిస్టు చేసింది. అదేవిధంగా టీవీలు, వాషింగ్ మిషన్లపై 20వేల రూపాయల మేర క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. మిక్సర్ గ్రైండర్స్, ఫ్యాన్లపై 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఉంది. ఇలా పేటీఎం మాల్లో అందించే చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
శాంసంగ్ ఇండిపెండెన్స్ సేల్: భారీ ఆఫర్
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోతవ్సం సందర్భంగా మొబైల్ దిగ్గజం శాంసంగ్ తన స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై బిగ్ డిస్కౌంట్లు, క్యాఫ్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ పై ఈ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు రూ.20వేల దాకా తగ్గింపును అందిస్తోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది శాంసంగ్ ఇండిపెండెన్స్ సేల్ లో భాగంగా, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్‌పై రూ. 8వేల క్యాష్ బ్యాక్ ( 64 జీబీ,128జీబీ రెండు వేరియంట్లు). దీనితో పాటు, ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ .12,000 వరకు అదనపు క్యాష్ బ్యాక్ లభ్యం. గాలక్సీ ఎస్ 7 ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులకు రూ .4వేల క్యాష్ బ్యాక్. రూ.12వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్. అంతేకాదు ఈ స్వాతంత్ర్య దినోత్సవ అమ్మకాలల్లో భాగంగా రెండు ఫోన్లపై 24 నెలల వరకు ఈఎంఐ ఆఫర్. కాగా గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఇప్పటికీ శాంసంగ్ బెస్ట్ స్మార్ట్ఫోన్లుగా పరిగణించబడుతున్నాయి. ఈ ఫోన్లు గత ఏడాది ఫిబ్రవరిలో గెలాక్సీ ఎస్ 7 రూ .48,900, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రూ .56,900 ధరలతో లాంచ్ అయ్యాయి.