ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్‌ డే’ సేల్‌ | Air India Announces Independence Day Sale | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్‌ డే’ సేల్‌

Published Sat, Aug 11 2018 11:04 AM | Last Updated on Sat, Aug 11 2018 1:06 PM

Air India Announces Independence Day Sale - Sakshi

ఎయిరిండియా విమానం (ఫైల్‌ ఫోటో)

ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్‌ డే’  సేల్‌ను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ ఆఫర్లలో విమాన టిక్కెట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఎయిరిండియా తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించింది. ఎయిరిండియా ఈ కొత్త ఆఫర్‌ కేవలం ఆన్‌లైన్‌ బుకింగ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఎవరైతే క్యారియర్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌ ఎయిరిండియా.ఇన్‌లో టిక్కెట్లను బుక్‌ చేసుకుంటారో వారికి ల‍భ్యం కానుంది. 2018 ఆగస్టు 15 వరకు ఈ సేల్‌ వాలిడ్‌లో ఉంటుంది. భారత్‌ పరిధిలో ప్రయాణం చేసేందుకే ఈ ఆఫర్‌ వర్తించనుందని ఎయిరిండియా తెలిపింది. ఈ డిస్కౌంట్‌ను పొందడానికి కస్టమర్లు ప్రోమో కోడ్‌ బాక్స్‌లో 18ఐఎన్‌డీఏఐ ప్రోమోకోడ్‌ను నమోదు చేయాల్సి ఉంది. 

ఎయిరిండియా డిస్కౌంట్‌ ఆఫర్‌ వివరాలు..

  • ఈ ఆఫర్‌లో ఎలాంటి నోటీసులు లేకుండా విమాన టిక్కెట్‌ ధరలు మారనున్నాయి. 
  • ఈ స్కీమ్‌కు ఫేర్‌ కండీషన్స్‌ను అప్లయ్‌ అవుతాయి. 
  • ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు, అలియెన్స్‌ ఎయిర్‌ ఫ్లైట్స్‌, కోడ్‌ షేర్‌ ఫ్లైట్స్‌కు ఈ డిస్కౌంట్‌ వర్తించదు.
  • పరిమిత వ్యవధిలోనే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

ఎయిరిండియా ప్రత్యర్థి జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ, జాతీయ విమాన టిక్కెట్లపై ‘ఫ్రీడం ఫేర్స​’ అనే సేల్‌ను ప్రకటించింది. గోఎయిర్‌ కూడా 10 లక్షల వరకు సీట్లను రూ.1099కే విక్రయిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement