ఎస్‌7, ఎస్‌7 ఎడ్జ్‌ వచ్చేశాయి.. రెటెంతో తెలుసా? | Samsung Galaxy S7 launched at Rs 48,900, S7 Edge at Rs 56,900 in India | Sakshi
Sakshi News home page

ఎస్‌7, ఎస్‌7 ఎడ్జ్‌ వచ్చేశాయి.. రెటెంతో తెలుసా?

Published Tue, Mar 8 2016 6:46 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

ఎస్‌7, ఎస్‌7 ఎడ్జ్‌ వచ్చేశాయి.. రెటెంతో తెలుసా? - Sakshi

ఎస్‌7, ఎస్‌7 ఎడ్జ్‌ వచ్చేశాయి.. రెటెంతో తెలుసా?

న్యూఢిల్లీ: ప్రఖ్యాత మొబైల్ కంపెనీ శామ్‌సంగ్‌ మంగళవారం భారత్ మార్కెట్‌లో తన కొత్త మోడళ్లైన గెలాక్సీ ఎస్‌7, ఎస్‌7 ఎడ్జ్‌లను లాంచ్‌ చేసింది. తన ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లయిన ఈ రెండు ఫోన్లను ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ లో లాంఛనంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో గెలాక్సీ ఎస్‌7 (32 జీబీ) రూ. 48,900, ఎస్‌7 ఎడ్జ్‌ (32 జీబీ) రూ. 56,900లకు లభించనున్నాయి.   

ఈ స్మార్ట్‌ఫోన్లను ప్రతిష్టాత్మక ఫీచర్లతో అందిస్తున్నట్టు కంపెనీ చెపుతోంది. ఈ కొత్త మోడళ్ల డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుందని, అలాగే తొలిసారి ఈ మొబైళ్లలో డుయల్ పిక్సల్ కెమెరాను వాడినట్టు శామ్‌సంగ్ తెలిపింది. గెలాక్సీ ఎస్‌7 త్రీడీ గ్లాస్ మెటల్ బాడీతో వస్తుంది. దీనిలో 5.1 క్యూహెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఇక ఎస్‌7 ఎడ్జ్‌ లో 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్లలోనూ 12 మెగా పిక్సల్‌ డుయల్ రియర్‌ లెన్స్ ఉంటాయి.

ఈ తాజా మోడళ్ల స్పెషాలిటీ ఏమిటంటే వీటి మెమరీ స్టోరేజీని బాగా ఎక్స్‌పాండ్ చేసుకునే వీలుండటం. ఈ రెండు ఫోన్లలోనూ మైక్రో ఎస్డీ కార్డ్‌ మెమరీ 200 జీబీ వరకు పెంచుకోవచ్చు. కొన్ని దేశాల్లో ఈ మెమరీ ట్రేను డ్యూయల్ సిమ్‌గా కూడా వాడుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. అలాగా ఈ రెండు కొత్త ఫోన్ల ర్యామ్ సామర్థ్యాన్ని 3జీబీ నుంచి 4 జీబీకి పెంచింది. వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌ అయిన ఈ రెండు ఫోన్లలో గెలాక్సీ ఎస్‌-7 బ్యాటరీ సామర్థ్యం 3000ఎంఏఎహ్‌ కాగా, ఎస్‌7 ఎడ్జ్‌ బ్యాటరీ పవర్‌ 3600ఎంఏహెచ్‌. బ్లాక్ షప్పైర్, గోల్డ్‌ ప్లాటినమ్‌, సిల్వర్ టైటానియం రంగుల్లో మూడు వేరియంట్లలో లభించే ఈ ఫోన్లు ఈ నెల 18 నుంచి మార్కెట్‌లో అమ్మనున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement