ఎస్7 తయారీ ఖర్చు మరీ అంతతక్కువా? | Galaxy S7 and Galaxy S7 Edge Items making cost Rs 15,750 | Sakshi
Sakshi News home page

ఎస్7 తయారీ ఖర్చు మరీ అంతతక్కువా?

Published Wed, Mar 16 2016 9:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

ఎస్7 తయారీ ఖర్చు మరీ అంతతక్కువా?

ఎస్7 తయారీ ఖర్చు మరీ అంతతక్కువా?

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్లు కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా అమ్మకాలు జరిగి రికార్డు సృష్టించాయి. అయితే ఈ మొబైల్స్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 సిరీస్ మొబైల్స్ తయారీ కోసం కేవలం రూ.16 వేలు మాత్రమే ఖర్చుచేస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. మార్కెట్లో కొన్ని సర్వేలలో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 వెర్షన్ ఉన్న ఎస్ 7 కోసం 255 డాలర్లు(భారత కరెన్సీలో కేవలం రూ. 15,750) అవుతుందట. సాఫ్ట్ వేర్ రీసెర్చ్, ఆర్ అండ్ డీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, పన్నులు ఇతర రకాల అలవెన్సులు ఇందుకు అధనం అని మార్కెట్ అనలిస్ట్ ఐహెచ్ఎస్ సర్వేలో తేలింది.

గెలాక్సీ ఎస్7 ధర రూ.48,900 ఉండగా, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.56,900 లతో శాంసంగ్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే, గెలాక్సీ ఎస్ 7 ప్రొడక్ట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు గెలాక్సీ ఎస్5 కంటే ఒక డాలర్ (దాదాపు రూ.70) తక్కువ పడుతుందట. గెలాక్సీ ఎస్5 మార్కెట్లోకి వచ్చిఇప్పటికీ రెండేళ్లు అవుతుంది. ఆపిల్ ఉత్పత్తులను పూర్తిగా అధిగమించి విక్రయాలను చేయాలని కసరత్తులు చేస్తోంది. బార్సిలోనాలో గత నెలలో ప్రవేశపెట్టిన ఈ మొబైల్స్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ మొబైల్స్ వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఓపెన్ మార్కెట్‌లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement