శాంసంగ్ కొత్త ఫోన్లు వచ్చేశాయ్!
శాంసంగ్ కొత్త ఫోన్లు వచ్చేశాయ్!
Published Mon, Sep 19 2016 3:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
స్మార్ట్ఫోన్ల రారాజు, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్, రెండు సరికొత్త ఫోన్లను సోమవారం మార్కెట్లోకి విడుదలచేసింది. జే సిరీస్లో గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్ పేర్లతో ఈ ఫోన్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ జే7 ప్రైమ్ ధర రూ.18,790గాను, గెలాక్సీ జే5 ధర రూ.14,790గాను కంపెనీ నిర్ణయించింది. గెలాక్సీ జే7 ప్రైమ్ స్మార్ట్ఫోన్ను శాంసంగ్ నేటి నుంచి అధికారికంగా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుండగా.. గెలాక్సీ జే5 ప్రైమ్ను సెప్టెంబర్ చివరి నుంచి అమ్మకాలు ప్రారంభించనుంది. గెలాక్సీ జే7 ప్రైమ్కు వొడాఫోన్ బండెల్ డేటా ఆఫర్ను శాంసంగ్ అందిస్తోంది. అదేవిధంగా గెలాక్సీ జే5 ప్రైమ్ కస్టమర్లు 1జీబీ డేటాకు నగదు చెల్లిస్తే, 9 జీబీ డేటాను మూడు నెలల వరకు ఉచితంగా వాడుకునే ఆఫర్ను శాంసంగ్ కల్పిస్తోంది. గెలాక్సీ జే7 ప్రైమ్ను గెలాక్సీ జే7కు అప్గ్రేడెడ్గా, గెలాక్సీ జే5 ప్రైమ్ ఫోన్ను గెలాక్సీ జే5కు అప్గ్రేడెడ్గా తీసుకొచ్చింది.
గెలాక్సీ జే7 ప్రైమ్ ఫీచర్లు..
5.50 అంగుళాల డిస్ప్లే
1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్
1080x1920 పిక్సెల్ రెజుల్యూషన్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
3 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
256 జీబీ విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్
గెలాక్సీ జే5 ప్రైమ్ ఫీచర్లు..
5.00 అంగుళాల డిస్ప్లే
1.4గిగిహెడ్జ్ ప్రాసెసర్
720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
2400 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్
Advertisement
Advertisement