గెలాక్సీ జే7 ప్రైమ్‌ 2 కూడా వచ్చేసింది | Samsung Galaxy J7 Prime 2 Launched At Rs 13,990 | Sakshi
Sakshi News home page

గెలాక్సీ జే7 ప్రైమ్‌ 2 కూడా వచ్చేసింది

Published Sat, Mar 24 2018 3:00 PM | Last Updated on Sat, Mar 24 2018 3:00 PM

Samsung Galaxy J7 Prime 2 Launched At Rs 13,990 - Sakshi

శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ 2

శాంసంగ్‌ కంపెనీ చడిచప్పుడు కాకుండా గెలాక్సీ జే7 ప్రైమ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. గతేడాది లాంచ్‌ చేసిన గెలాక్సీ జే7 ప్రైమ్‌కు సక్ససర్‌గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని ధర 13,990గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్టు అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ‘సోల్డ్‌ అవుట్‌’  అయినట్టు తెలిసింది. కొత్త గెలాక్సీ జే7 ప్రైమ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ అప్‌డేటెడ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌ను, 13 ఎంపీ ఫ్రంట్‌ అదేవిధంగా రియర్‌ షూటర్‌ను, లైవ్‌ స్టికర్స్‌, లైవ్‌ ఫిల్డర్స్‌ వంటి సోషల్‌ ఫీచర్లను కలిగి ఉంది. మాల్‌ అనే శాంసంగ్‌ ఆల్‌-ఇన్‌-వన్‌ షాపింగ్‌ సర్వీసును ఇది కలిగి ఉంది. శాంసంగ్‌ పే మినీని కూడా ఇది సపోర్టు చేస్తోంది. 

శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ 2 ఫీచర్లు...
5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ టీఈటీ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌
మెటల్‌ యూనిబాడీ డిజైన్‌
1.6గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ఎక్సీనోస్‌ 7 సిరీస్‌ ప్రాసెసర్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
ఆండ్రాయిడ్‌ నోగట్‌, 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ ఆప్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement