Galaxy J7 Prime
-
గెలాక్సీ జే7 ప్రైమ్ 2 కూడా వచ్చేసింది
శాంసంగ్ కంపెనీ చడిచప్పుడు కాకుండా గెలాక్సీ జే7 ప్రైమ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ జే7 ప్రైమ్‌కు సక్ససర్‌గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని ధర 13,990గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ వెబ్సైట్లో లిస్టు అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ‘సోల్డ్ అవుట్’ అయినట్టు తెలిసింది. కొత్త గెలాక్సీ జే7 ప్రైమ్ 2 స్మార్ట్‌ఫోన్ అప్డేటెడ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను, 13 ఎంపీ ఫ్రంట్ అదేవిధంగా రియర్ షూటర్‌ను, లైవ్ స్టికర్స్, లైవ్ ఫిల్డర్స్ వంటి సోషల్ ఫీచర్లను కలిగి ఉంది. మాల్ అనే శాంసంగ్ ఆల్-ఇన్-వన్ షాపింగ్ సర్వీసును ఇది కలిగి ఉంది. శాంసంగ్ పే మినీని కూడా ఇది సపోర్టు చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ 2 ఫీచర్లు... 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ టీఈటీ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ మెటల్ యూనిబాడీ డిజైన్ 1.6గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 7 సిరీస్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఆండ్రాయిడ్ నోగట్, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ ఆప్షన్ -
ఆ రెండు శాంసంగ్ ఫోన్లపై ధర తగ్గింపు
న్యూఢిల్లీ : దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్ తన బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై ధర తగ్గించింది. గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్లపై ధర తగ్గిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. తగ్గించిన ధరల ప్రకారం రూ.18,790గా ఉన్న శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ ధర రూ.14,900కు దిగొచ్చింది. అదేవిధంగా గెలాక్సీ జే5 ప్రైమ్‌పై రూ.1800 ధర కోత పెట్టిన శాంసంగ్, ఈ ఫోన్‌ను కూడా 12,990 రూపాయలకే విక్రయానికి తీసుకొచ్చింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చాయి. గెలాక్సీ జే7 ప్రైమ్ ఫీచర్లు.. 5.50 అంగుళాల డిస్ప్లే 1.6 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గెలాక్సీ జే5 ప్రైమ్ ఫీచర్లు.. 5.00 అంగుళాల డిస్ప్లే 1.4గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2400 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
శాంసంగ్ కొత్త ఫోన్లు వచ్చేశాయ్!
స్మార్ట్ఫోన్ల రారాజు, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్, రెండు సరికొత్త ఫోన్లను సోమవారం మార్కెట్లోకి విడుదలచేసింది. జే సిరీస్‌లో గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్ పేర్లతో ఈ ఫోన్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ జే7 ప్రైమ్ ధర రూ.18,790గాను, గెలాక్సీ జే5 ధర రూ.14,790గాను కంపెనీ నిర్ణయించింది. గెలాక్సీ జే7 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ నేటి నుంచి అధికారికంగా వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుండగా.. గెలాక్సీ జే5 ప్రైమ్‌ను సెప్టెంబర్ చివరి నుంచి అమ్మకాలు ప్రారంభించనుంది. గెలాక్సీ జే7 ప్రైమ్‌కు వొడాఫోన్ బండెల్ డేటా ఆఫర్‌ను శాంసంగ్ అందిస్తోంది. అదేవిధంగా గెలాక్సీ జే5 ప్రైమ్ కస్టమర్లు 1జీబీ డేటాకు నగదు చెల్లిస్తే, 9 జీబీ డేటాను మూడు నెలల వరకు ఉచితంగా వాడుకునే ఆఫర్‌ను శాంసంగ్ కల్పిస్తోంది. గెలాక్సీ జే7 ప్రైమ్‌ను గెలాక్సీ జే7కు అప్‌గ్రేడెడ్‌గా, గెలాక్సీ జే5 ప్రైమ్ ఫోన్‌ను గెలాక్సీ జే5కు అప్‌గ్రేడెడ్‌గా తీసుకొచ్చింది. గెలాక్సీ జే7 ప్రైమ్ ఫీచర్లు.. 5.50 అంగుళాల డిస్ప్లే 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గెలాక్సీ జే5 ప్రైమ్ ఫీచర్లు.. 5.00 అంగుళాల డిస్ప్లే 1.4గిగిహెడ్జ్ ప్రాసెసర్ 720x1280 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 2400 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్