న్యూఢిల్లీ : దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం శాంసంగ్ తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై ధర తగ్గించింది. గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్‌లపై ధర తగ్గిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. తగ్గించిన ధరల ప్రకారం రూ.18,790గా ఉన్న శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్ ధర రూ.14,900కు దిగొచ్చింది. అదేవిధంగా గెలాక్సీ జే5 ప్రైమ్‌పై రూ.1800 ధర కోత పెట్టిన శాంసంగ్, ఈ ఫోన్‌ను కూడా 12,990 రూపాయలకే విక్రయానికి తీసుకొచ్చింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి వచ్చాయి.
గెలాక్సీ జే7 ప్రైమ్ ఫీచర్లు..
5.50 అంగుళాల డిస్‌ప్లే
1.6 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
3 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్
గెలాక్సీ జే5 ప్రైమ్ ఫీచర్లు..
5.00 అంగుళాల డిస్‌ప్లే
1.4గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2400 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్