
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో బయటపడిన కరోనా వైరస్ బి-1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైన స్ట్రెయిన్‌గా వర్గీకరించిందంటూ నిన్నంత తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బి-1.617.. భారత్ రకం స్ట్రెయిన్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎక్కడా వెల్లడించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా సంస్థలే అలా వాడుతున్నాయని పేర్కొంది.
‘‘బి-1.617 వైరస్ స్ట్రెయిన్ ఆందోళనకర రకంగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గీకరించినట్లు చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాల్లో బి-1.617ను ‘భారత వేరియంట్’ అని పేర్కొన్నారు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవే కాక అవాస్తం. బి.1.617ను భారత రకం స్ట్రెయిన్ అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పలేదు. కరోనా వైరస్‌ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో 32 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడా ‘భారత్’ అనే పదం లేదు’’అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
This is to clarify that WHO has not associated the term “Indian Variant” with the B.1.617 variant of the coronavirus in its 32 page document. In fact, the word “Indian” has not been used in its report on the matter: Government of India
— ANI (@ANI) May 12, 2021
బి.1.6.17 స్ట్రెయిన్ ఆందోళనకర రకంగా పేర్కొన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్ విభాగ సాంకేతిక నిపుణురాలు డా. మరియా వాన్ కేర్‌కోవ్ రెండు రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత్‌లో వెలుగుచూసిన ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత గురించి తమకు అవగాహన ఉందని, దీనిపై అధ్యయనాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఇది ప్రపంచానికి ఆందోళనకరమని గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే ఇదంతా ప్రాథమిక సమాచారం మాత్రమేనని, దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సినం అవసరం ఉందని తెలిపారు.
చదవండి: ఇండియన్ కోవిడ్ స్ట్రెయిన్ ఆందోళనకరం: డబ్ల్యూహెచ్‌ఓ