
నిస్సాన్ కార్ల ధరల పెంపు!
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ కూడా టయోటా, రెనో, టాటా మోటార్స్ దారిలోనే పయనిస్తోంది.
జనవరి 1 నుంచి అమల్లోకి..
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ కూడా టయోటా, రెనో, టాటా మోటార్స్ దారిలోనే పయనిస్తోంది. ఇది తాజాగా జనవరి 1 నుంచి వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు రూ.30,000 వరకు ఉంటుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరుగుదలే ధరల పెంపునకు కారణమని వివరించింది. కాగా కంపెనీ తన వాహనాలను నిస్సాన్, డాట్సన్ బ్రాండ్ల కింద మార్కెట్‌లో విక్రయిస్తోంది. వీటి ధర రూ.3.28 లక్షల నుంచి రూ.13.75 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉంది.