
నిన్సాన్ మైక్రా 2017 లాంచ్...ధర ఎంత?
న్యూఢిల్లీ: జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ మోటార్ ఇండియా శుక్రవారం తన కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ మైక్రాకు అప్ టేడెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. 2017 నిస్సాన్ మైక్రా ప్రారంభ ధరను రూ .5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజీన్, 1.5లీటర్ల డీజిల్ ఇంజీన్ రెండు వేరియంట్లలో కొత్త మైక్రాను ప్రవేశపెట్టింది.
పెట్రోల్ వేరియంట్ ధరను రూ .5.99 లక్షలు, రూ. 6.95 లక్షల మధ్య, డీజిల్ వేరియంట్‌ను రూ. 6.62 లక్షల నుంచి రూ.7.23 లక్షలుగాఉండనున‍్నట్టు కంపెనీ తెలిపింది. జపనీస్ టెక్నాలజీ, యూరోపియన్ స్టయిల్‌తో తన కొత్త ప్రీమియమ్ అర్బన్ హ్యాచ్‌బ్యాక్ మైక్రాను ఆకర్షణీయమైన ధరల్లో తీసుకొచ్చినట్టు నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ మల్హోత్రా చెప్పారు.
1.2 పెట్రోల్ ఇంజన్ను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 1.5 లీటరు డీజిల్ వెర్షన్‌లో 5స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తున్న ఈ కారులో ఆటో హెడ్ లాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ తదితర ఇతర ఫీచర్లు ఉన్నాయి.
కాగా 2010లో భారత్ లోలాంచ్ అయిన నిస్సాన్ మైక్రా కార్లు ఇప్పటివరకూ 80 వేల యూనిట్లు భారతదేశంలో నిస్సాన్ విక్రయించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.