ఆన్‌లైన్‌లో నిస్సాన్ కార్లు | You can now buy Nissan cars online in India | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో నిస్సాన్ కార్లు

Published Tue, Dec 10 2013 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

ఆన్‌లైన్‌లో నిస్సాన్ కార్లు

ఆన్‌లైన్‌లో నిస్సాన్ కార్లు

 న్యూఢిల్లీ: నిస్సాన్ కంపెనీ ఆన్‌లైన్ విక్రయాలకు శ్రీకారం చుట్టింది. అన్ని నిస్సాన్ మోడళ్ల కార్లను ఇంటర్నెట్ ద్వారా విక్రయించనున్నామని  హోవర్ ఆటోమోటివ్ ఇండియా డెరైక్టర్(మార్కెటింగ్)  నితీష్ టిప్నిస్ సోమవారం తెలిపారు. భారత్‌లో నిస్సాన్ కార్లను ఈ కంపెనీయే విక్రయిస్తోంది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో నచ్చిన నిస్సాన్ మోడళ్లను బుక్ చేసుకోవచ్చని, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చని నితీష్ పేర్కొన్నారు.

వినియోగదారులు సమీపంలో ఉన్న  నిస్సాన్ డీలర్ వద్ద డెలివరీ తీసుకోవచ్చని వివరించారు. వినియోగదారులు కార్లు కొనుగోలు చేసే ముందు ఆన్‌లైన్‌లో విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారని అందుకే ఆన్‌లైన్‌లో కొనుగోలు అవకాశాన్ని అందిస్తున్నామని తెలిపారు. కారు కొనుగోలు ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి ఆన్‌లైన్ కొనుగోలు ఉపకరిస్తుందని వివరించారు. ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఆకర్షణీయమైన ఆఫర్లనందిస్తున్నామని తెలిపారు. నిస్సాన్ కంపెనీ భారత్‌లో మైక్రా, సన్నీ, ఇవలియా, ఎస్‌యూవీలు - టెర్రానో, ఎక్స్-ట్రయల్‌లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.4.9 లక్షల నుంచి రూ.26.96 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement