మార్కెట్‌లోకి టెర్రానో కారు
Published Fri, Sep 27 2013 2:53 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
రాజమండ్రి రూరల్, న్యూస్‌లైన్ : జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ మోటార్ రూపొందించిన టెర్రానో అనే ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు గురువారం మార్కెట్‌లోకి విడుదలైంది. రాజమండ్రి కంటిపూడి నిస్సాన్ కార్ల షోరూమ్‌లో ఈ కారును రాజమండ్రి ఆర్టీవో హైమారావు చేతులమీదుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేతలు ఎం.జగన్, కె.వినయబాబు మాట్లాడుతూ ఈ కారు పెట్రోలు, డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతుందని చెప్పారు.
డీజిల్ వెర్షన్‌లో లీటరుకు 20.45 కిలోమీటర్లు, పెట్రోలు వెర్షన్‌లో లీటరుకు 13.24 కిలో మీటర్ల మైలేజ్ వస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు వెర్షన్లలో 85 పీఎస్ ఇంజన్, 110 పీఎస్ ఇంజన్ ఆప్షన్లతో ఐదు వేరియంట్లలో ఆరు రంగుల్లో లభ్యమవుతుందని తెలిపారు. మిషన్‌కటింగ్ అలై వీల్స్, ఫుల్‌ఫంక్షనల్ టేల్ ల్యాంప్స్, స్టాండర్డ్ హెడ్ ల్యాంప్స్, కంప్లీట్ లెదర్ ఇంటీరియర్‌తో డిజైన్ చేయడం వలన టెర్రానో మరింత ఆకర్షణీయంగా ఉందన్నారు. టెర్రానో బుకింగ్స్ ఈనెల 9న ప్రారంభించామని తెలిపారు. కంటిపూడి నిస్సాన్ డెరైక్టర్ సీహెచ్‌వీ.సత్యనారాయణమూర్తి (చినబాబు), ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీరామ్మూర్తి, యర్రాప్రగడ రామకృష్ణ, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement