నిస్సాన్‌ సన్నీ ధర భారీ కోత | Nissan slashes prices of its sedan Sunny | Sakshi
Sakshi News home page

నిస్సాన్‌ సన్నీ ధర భారీ కోత

Published Fri, Apr 21 2017 1:15 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

నిస్సాన్‌ సన్నీ ధర భారీ కోత - Sakshi

నిస్సాన్‌ సన్నీ ధర భారీ కోత

రూ. 1.99 లక్షల దాకా తగ్గింపు...
న్యూఢిల్లీ: జపాన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్‌ తాజాగా సన్నీ సెడాన్‌ కారు ధరను రూ. 1.99 లక్షల దాకా తగ్గించింది. ఇకపై దీని ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 8.99 లక్షల దాకా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుందని నిస్సాన్‌ మోటార్‌ ఇండియా తెలిపింది. పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ. 1.01 లక్ష తగ్గి రూ. 6.99 లక్షలుగాను, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ రేటు రూ. 1.99 లక్షలు తగ్గి రూ. 8.99 లక్షలుగాను ఉండనుంది.

మరోవైపు డీజిల్‌ ఆప్షన్‌లో బేస్‌ వేరియంట్‌ ధర రూ. 1.31 లక్షలు తగ్గి రూ. 7.49 లక్షలుగా, టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ రూ. 94,000 తగ్గి రూ. 8.99 లక్షలుగా (అన్నీ ఢిల్లీ ఎక్స్‌–షోరూం ధరలు) ఉండనుంది. స్థానికంగా ఉత్పత్తి చేయడంతో రేట్లను గణనీయంగా తగ్గించేందుకు సాధ్యపడిందని, ఆ ప్రయోజనాలు కస్టమర్లకు బదలాయిస్తున్నామని సంస్థ ఎండీ అరుణ్‌ మల్హోత్రా తెలిపారు. చాలా మటుకు విడిభాగాలను దేశీయంగానే ఉత్పత్తి చేస్తున్నందున నిస్సాన్‌ గతేడాది ప్రీమియం హ్యాచ్‌బాక్‌ మైక్రా కారులో ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ ధరను రూ. 54,252 దాకా తగ్గించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement