
క్రాష్ టెస్టులో నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో ఎంతోమంది కోరిన కారది. ప్రపంచంలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు కూడా అదే. ప్రస్తుతం ప్రపంచంలో అతి సురక్షితమైన ఎలక్ట్రిక్ కారుగా కూడా నిలిచింది ‘నిస్సాన్ లీఫ్’ . యూరో ఎన్‌క్యాప్ సురక్షిత పరీక్షలో ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ మేరకు నిస్సాన్ ఓ ప్రకటన చేసింది.
కారుకు టెస్టు నిర్వహిస్తున్న వీడియోను కూడా విడుదల చేసింది. యూరో ఎన్‌క్యాప్ పరీక్షలో 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి ఎలక్ట్రిక్ కారు కూడా నిస్సాన్ లీఫే. 2011లో తొలిసారి నిస్సాన్ లీఫ్‌ను నిస్సాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ముందు వెళ్లే సైకిస్టు, పాదచారులను గుర్తించి ఆటోమేటిక్ బ్రేక్ సదుపాయాన్ని కూడా కొత్తమార్పుల్లో లీఫ్‌కు నిస్సాన్ జోడించింది.