నిస్సాన్‌ బంపర్‌ ఆఫర్లు: కారు గెల్చుకోవచ్చు! | Nissan India has announced a host of offers on Nissan and Datsun models for customers with effect from September 5 | Sakshi
Sakshi News home page

నిస్సాన్‌ బంపర్‌ ఆఫర్లు: కారు గెల్చుకోవచ్చు!

Published Fri, Sep 8 2017 10:04 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

నిస్సాన్‌ బంపర్‌ ఆఫర్లు: కారు గెల్చుకోవచ్చు!

నిస్సాన్‌ బంపర్‌ ఆఫర్లు: కారు గెల్చుకోవచ్చు!

సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల ఉత్పత్తిదారు నిస్సాన్‌ ఇండియా  వినియోగదారులకు బంపర్‌ ఆఫర్లను అందిస్తోంది.  నిస్సాన్‌, డాట్సన్‌ మోడల్‌ కార్ల కొనుగోళ్లపై  భారీ ప్రయోజనాలను అందించనున‍్నట్టు కంపెనీ ఒక  ప్రకటనలో తెలిపింది.   నిస్సాన్‌    వెల్లడించిన ఈ పండుగ బొనాంజా ఆఫర్‌లో  కారు కొనుగోలుపై ఒక బంగారు నాణాన్ని అందిస్తోంది. దీంతోపాటు ఉచితంగా కారు గెల్చుకునే అవకాశాన్ని కస్టమర్లకు  కల్పిస్తోంది.  దీంతోపాటు ఉచిత బీమా, ఎక్స్ఛేంజ్ బోనస్,   కార్పోరేట్ ఆఫర్  సహా  దాదాపు రూ. 71,000 వరకు  డిస్కౌంట్‌ లభించనుంది.

నిస్సాన్, డాట్సన్ మోడళ్లపై వినియోగదారులకు అందిస్తున్న ఈ ఆఫర్లు సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చినట్టు నిస్సాన్‌ ఇండియా ప్రకటించింది. వినియోగదారులు నిస్సాన్‌ ,  డాట్సన్‌ కారును   ఈ పండుగ ఆఫర్‌లో సెప్టెంబర్‌19వ తేదీ లోపు  కొనుగోలు చేస్తే ఉచితంగా కారు గెలు చుకునే అవకాశం.   ఇలా తొమ్మిదిమంది లక్కీ విజేతలను ఎంపిక చేయనుంది.  

ప్రతి నిస్సాన్‌, డాట్సన్‌ కారు  కొనుగోలుపై కస్టమర్లకు ఒక బంగారు నాణాన్ని అందిస్తోంది.  అలాగే 7.99 శాతం వడ్డీతో నిస్సాన్‌ రెనాల్ట్‌ ఫైనాన్షియల​ సర్వీసెస్‌ ఇండియా ద్వారా రుణ సదుపాయం కూడా ఉంది.  ‘పిల్లర్స్‌ ఆఫ్‌ ఇండియా’ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు  డాట్సన్‌ రెడి-గోపై  అదనంగా రూ.6వేల డిస్కౌంట్‌ అందిస్తోంది. 

 మైక్రా ఎంసీ పై 39,000 రూపాయల వరకు,  మైక్రా  యాక్టివ్‌పై రూ. 34000 వరకు తగ్గింపు.  (ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10వేలు, రూ. 4వేల  కార్పొరేట్ ఆఫర్ కలిపి)   
డాట్సన్‌ మోడళ్లలో గో ప్లస్‌ పై  రూ.16,000,  రెడి గోపై రూ.14, 500, రెడీ గో (800) సీసీపై  13వేల వరకు ప్రత్యేక ఆఫర్‌ అందించనుంది. వీటిలో ఉచిత బీమా, రూ. 2,000 కార్పోరేట్  ఆఫర్ తదితరాలు ఉండనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement