సాక్షి లాంచ్ చేసిన నిస్సాన్ స్పోర్టీ కారు | Nissan's Datsun redi-GO Sport launched at Rs 3.5 lakh | Sakshi
Sakshi News home page

సాక్షి లాంచ్ చేసిన నిస్సాన్ స్పోర్టీ కారు

Published Thu, Sep 29 2016 6:24 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

సాక్షి లాంచ్ చేసిన నిస్సాన్ స్పోర్టీ కారు

సాక్షి లాంచ్ చేసిన నిస్సాన్ స్పోర్టీ కారు

న్యూఢిల్లీ:  రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకున్న నిస్సాన్  తక్కువ బడ్జెట్ లో డాట్సన్ బ్రాండ్   స్పోర్ట్స్ వెర్షన్  కొత్త కారును  అందుబాటులోకి తీసుకొచ్చింది.   మూడున్నర లక్షల ధరలో  'రెడీ గో  స్పోర్ట్  '  పేరుతో  పరిమిత ఎడిషన్  ను లాంచ్ చేసింది. భారత రెజ్లర్ ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మా లిక్‌  చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. దీని ధరను  రూ 3,49,479లు(ఢిల్లీ ఎక్స్‌షో రూం) గా కంపెనీ నిర్ణయించింది. డాట్సన్‌ రెడీ -గో  స్పోర్ట్ లిమిటెడ్‌ ఎడిషన్‌ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది.  ఈ కొత్త పండుగను సాక్షి మాలిక్ తో జరుపుకోవడం సంతోషంగా ఉందని  నిస్సాన్ మోటార్  ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు.

రుబీ, వైట్, అండ్ గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.  త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్నతమ  అన్ని డాట్సన్ డీలర్ షిప్ లలో  అందుబాటులో  ఉండనుందని తెలిపారు. ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు ఒక స్పోర్టి-నేపథ్యాన్ని జోడిస్తుందని తెలిపారు. ఈ స్పోర్టీ రెడి-గో స్పోర్ట్  లో థీమ్ వీల్ కవర్, స్పోర్టి గ్రాఫిక్స్, స్పోర్టి రూఫ్ స్పాయిలర్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్,  స్పోర్టి డాష్ బోర్డ్ లాంటి  కొత్త ఫీచర్లు ఇందులోఉన్నాయని కంపెనీ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement