redi-GO Sport
-
షావోమీ నుంచి రెడ్మీ గో స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమీ తాజాగా రెడ్మీ గో పేరిట భారత మార్కెట్లో కొత్త ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ. 4,499గా ఉంటుంది. 1 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెన్సార్, క్వాడ్–కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 425 చిప్ మొదలైనవి ఇందులో ప్రత్యేకతలు. మరోవైపు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత చెల్లింపులకు సంబంధించి ’మి’ పేమెంట్స్ యాప్‌ను కూడా షావోమీ ఆవిష్కరించింది. పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహరిస్తుందని తెలిపింది. కేవలం యూపీఐకి మాత్రమే పరిమితం కాకుండా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. త్వరలోనే ‘మి’ యాప్‌స్టోర్‌లో అందుబాటులోకి వస్తుందని షావోమీ తెలిపింది. షావోమీ అటు తమిళనాడులో మరో ప్లాంటును ప్రారంభించింది. దీంతో భారత్‌లో తమ ప్లాంట్ల సంఖ్య 7కు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్, హైప్యాడ్ సంస్థల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించింది. -
సాక్షి లాంచ్ చేసిన నిస్సాన్ స్పోర్టీ కారు
న్యూఢిల్లీ: రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకున్న నిస్సాన్ తక్కువ బడ్జెట్ లో డాట్సన్ బ్రాండ్ స్పోర్ట్స్ వెర్షన్ కొత్త కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడున్నర లక్షల ధరలో 'రెడీ గో స్పోర్ట్ ' పేరుతో పరిమిత ఎడిషన్ ను లాంచ్ చేసింది. భారత రెజ్లర్ ఒలింపిక్ పతక విజేత సాక్షి మా లిక్ చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేశారు. దీని ధరను రూ 3,49,479లు(ఢిల్లీ ఎక్స్‌షో రూం) గా కంపెనీ నిర్ణయించింది. డాట్సన్ రెడీ -గో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్‌ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త పండుగను సాక్షి మాలిక్ తో జరుపుకోవడం సంతోషంగా ఉందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు. రుబీ, వైట్, అండ్ గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్నతమ అన్ని డాట్సన్ డీలర్ షిప్ లలో అందుబాటులో ఉండనుందని తెలిపారు. ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు ఒక స్పోర్టి-నేపథ్యాన్ని జోడిస్తుందని తెలిపారు. ఈ స్పోర్టీ రెడి-గో స్పోర్ట్ లో థీమ్ వీల్ కవర్, స్పోర్టి గ్రాఫిక్స్, స్పోర్టి రూఫ్ స్పాయిలర్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్, స్పోర్టి డాష్ బోర్డ్ లాంటి కొత్త ఫీచర్లు ఇందులోఉన్నాయని కంపెనీ తెలిపింది.