Nissan recalls over 8 lakh SUVs; key defect can cut off engine - Sakshi
Sakshi News home page

నిస్సాన్‌ కస్టమర్లకు భారీ షాక్‌: 8 లక్షల కార్లు రీకాల్‌

Published Wed, Mar 1 2023 4:37 PM | Last Updated on Wed, Mar 1 2023 5:22 PM

Nissan recalls over 8lakh cars recall over key defect that can cut off engine - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ తన కస్టమర్లు షాకింగ్‌ న్యూస్‌  చెప్పింది. అమెరికా, కెనడాలో దాదాపు 8 లక్షల కార్లను రీకాల్‌ చేస్తోంది. ఇంజీన్‌లో లోపం కారణంగా ఈ భారీ రీకాల్‌ చేపట్టింది.  2014 నుండి 2020లో కొన్న రోగ్‌ మోడల్ కార్లను, అలాగే 2017 నుండి 2022 వరకు  విక్రయించిన రోగ్ స్పోర్ట్స్‌ కార్లను వెనక్కి తీసుకోనుంది. 

ఈ కార్లలో జాక్‌నైఫ్ ఫోల్డింగ్ కీ పూర్తిగా తెరుచుకోక పోవచ్చని, కీని పాక్షికంగా తిప్పి, డ్రైవ్ చేస్తే, డ్రైవర్‌ ఫోబ్‌ను తాకడం, లేదా ఇంజీన్‌ ఆగిపోవడం లాంటివి జరగవచ్చని నిస్సాన్‌ తెలిపింది.  అంతేకాదు  దీని కారణంగా  ఇంజిన్ పవర్ ,  పవర్ బ్రేక్‌లను కోల్పోయేలా చేస్తుంది. కారు క్రాష్‌ అవవ్వొచ్చు. ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్‌ కాకపోవచ్చు అని తెలిపింది. అయితే ప్రమాద తీవ్రతపై స్పష్టత లేదని పేర్కొంది. ఫలితంగా అమెరికా, కెనడాలో 809,000 కంటే ఎస్‌యూవీలను రీకాల్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.అలాగే సంబంధిత కారు యజమానులకు ఈ మార్చి నెలలో సమాచారం అందిస్తున్నట్టు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement