Cut off
-
ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?
లిక్విడ్ ఫండ్‌లో ఉన్న నా పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించినట్టయితే, అదే రోజు ఎన్ఏవీ వర్తిస్తుందా? – అజయ్ కుమార్ఏ తరహా మ్యూచువల్ ఫండ్(Mutual Funds)లో పెట్టుబడులు ఉన్నాయి..ఏ సమయంలో అభ్యర్థన (కొనుగోలు/విక్రయం) పంపించారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు లిక్విడ్ ఫండ్ పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించేందుకు ఆర్డర్ చేశారని అనుకుందాం. లిక్విడ్ ఫండ్స్‌కు కటాఫ్ సమయం మధ్యాహ్నం 3 గంటలు. మీ అభ్యర్థన ఈ సమయానికి ముందే చేశారు కనుక, విక్రయించిన యూనిట్లకు శుక్రవారం నాటి ఎన్ఏవీ వర్తిస్తుంది. ఇలా విక్రయించిన పెట్టుబడులు బ్యాంక్ అకౌంట్(Bank Account)లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? అన్నది తెలుసుకుందాం. ఈ విషయంలోనూ ఏ ఫండ్‌లో పెట్టుబడులు విక్రయించారన్నది కీలకం అవుతుంది. లిక్విడ్ ఫండ్, ఓవర్‌నైట్ ఫండ్‌లో పెట్టుబడులను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు ఒక పనిదినం పడుతుంది. ఇతర డెట్ ఫండ్స్ అయితే, రెండు రోజుల సమయం తీసుకుంటుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు వెనక్కి వచ్చేందుకు మూడు పనిదినాలు పడుతుంది. టీప్లస్ రూపంలో ఈ విషయాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు తెలియజేస్తాయి.ఉదాహరణకు సోమవారం నాడు ఈక్విటీ ఫండ్స్(Equity Funds)లో పెట్టుబడులు విక్రయించారని అనుకుంటే, ఈ మొత్తం గురువారం నాడు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. రియలైజింగ్ మనీ అంటే.. ఇన్వెస్టర్ కొనుగోలు ఆర్డర్‌కు సంబంధించిన మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థ (AMC) అందుకోవడం. బ్యాంక్ నుంచి పంపించారనుకుంటే ఆ మొత్తం ఏఎంసీ చేరేందుకు కొన్ని గంటలు లేదా రోజు సమయం తీసుకోవచ్చు. కొనుగోలు ఏ రోజు చేశారన్న దానితో సంబంధం లేకుండా, ఏఎంసీకి ఆ మొత్తం అందిన రోజు ఎన్ఏవీనే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడులను కటాఫ్ సమయం 3 గంటలు దాటిన తర్వాత విక్రయించారని అనుకుంటే, అప్పుడు తర్వాతి రోజు ఎన్ఏవీ పెట్టుబడులకు వర్తిస్తుంది. ఎందుకంటే తర్వాతి రోజునే ఫండ్స్ సంస్థలు ఆ మేరకు విక్రయాలు చేస్తాయి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..నాకు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడులు ఉన్నాయి. వాటిని ఇటీవలే విక్రయించి అదే పథకం డైరెక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేశాను. కనుక లాభాలపై నేను పన్ను చెల్లించాలా? లేక భవిష్యత్తులో పెట్టుబడులు విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తుందా? – రాజన్ పీ.ఏఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్ నుంచి మరో ప్లాన్‌లోకి మారినప్పుడు, అది రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్ అయినా సరే దాన్ని పెట్టుబడి ఉపసంహరణగానే చూస్తారు. ఆదాయపన్ను చట్టం కింద పెట్టుబడుల విక్రయమే అవుతుంది. దీనర్థం.. మూలధన లాభాలపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మరో ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, భవిష్యత్తులో విక్రయించినట్టయితే.. హోల్డింగ్ పీరియడ్ (ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారు), వచ్చిన మూలధన లాభాల ఆధారంగా తిరిగి అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడి నుంచి విక్రయం మధ్య కాలానికి పన్ను వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వాల్యూ రీసెర్చ్ -
ముంబైలోనూ నీటి కష్టాలు.. నీటి సరఫరా 15 శాతం కట్?
దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో చుక్క నీటి కోసం జనం తహతహలాడుతున్నారు. ఇప్పుడు ముంబైలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తాజాగా నీటి సరఫరాను ఐదు శాతంమ మేరకు తగ్గించింది. ఈరోజు (మార్చి 19) ముంబైలో నీటి కోత 15 శాతం మేరకు ఉంటుందని ప్రకటించింది. దీంతో ముంబైవాసులలో ఆందోళన పెరిగింది. నిర్వహణ పనుల కారణంగా నీటి సరఫరాను తగ్గించినట్లు బీఎంసీ పేర్కొంది. పౌర సంఘం తెలిపిన వివరాల ప్రకారం థానే జిల్లాలోని పైస్ డ్యామ్‌లో నీటి కొరత కారణంగా నగరం అంతటా అదనపు నీటి కోత విధించారు. తాజాగా బీఎంసీ ఒక ప్రకటనలో మహానగరానికి 60 కి.మీ దూరంలో ఉన్న డ్యామ్‌కు భట్సా రిజర్వాయర్ నుండి నీరు వచ్చిన తర్వాత నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని తెలిపింది. ఇదిలావుండగా ఆసియాలోని అతిపెద్ద ప్లాంట్లలో ఒకటైన భాండూప్‌లోని వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్‌లో క్లీనింగ్ కారణంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 24 వరకు ముంబైలో ఐదు శాతం నీటి కోతను బీఎంసీ ప్రకటించింది. డ్యామ్‌లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున గతంలో పది శాతం నీటిని తగ్గించాలని ప్రతిపాదించింది. కాగా కర్ణాటక రాజధాని బెంగళూరు ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి కోసం ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదంటే బెంగళూరులో 14 వేల బోర్‌వెల్స్‌లో 6,900 ఎండిపోయాయి. దీంతో పాటు చెరువులన్నీ కూడా దాదాపు అడుగంటిపోయాయి. -
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీవో కుదింపు
ముంబై: ఎన్బీఎఫ్సీ.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ గతేడాది నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది. -
నిస్సాన్ కస్టమర్లకు భారీ షాక్: 8 లక్షల కార్లు రీకాల్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ తన కస్టమర్లు షాకింగ్ న్యూస్ చెప్పింది. అమెరికా, కెనడాలో దాదాపు 8 లక్షల కార్లను రీకాల్ చేస్తోంది. ఇంజీన్‌లో లోపం కారణంగా ఈ భారీ రీకాల్ చేపట్టింది. 2014 నుండి 2020లో కొన్న రోగ్ మోడల్ కార్లను, అలాగే 2017 నుండి 2022 వరకు విక్రయించిన రోగ్ స్పోర్ట్స్ కార్లను వెనక్కి తీసుకోనుంది. ఈ కార్లలో జాక్‌నైఫ్ ఫోల్డింగ్ కీ పూర్తిగా తెరుచుకోక పోవచ్చని, కీని పాక్షికంగా తిప్పి, డ్రైవ్ చేస్తే, డ్రైవర్ ఫోబ్‌ను తాకడం, లేదా ఇంజీన్ ఆగిపోవడం లాంటివి జరగవచ్చని నిస్సాన్ తెలిపింది. అంతేకాదు దీని కారణంగా ఇంజిన్ పవర్ , పవర్ బ్రేక్‌లను కోల్పోయేలా చేస్తుంది. కారు క్రాష్ అవవ్వొచ్చు. ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కాకపోవచ్చు అని తెలిపింది. అయితే ప్రమాద తీవ్రతపై స్పష్టత లేదని పేర్కొంది. ఫలితంగా అమెరికా, కెనడాలో 809,000 కంటే ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది.అలాగే సంబంధిత కారు యజమానులకు ఈ మార్చి నెలలో సమాచారం అందిస్తున్నట్టు తెలిపింది. -
తెరవెనుక మంత్రం.. బదిలీలకు దూరం
జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల బదిలీల్లో లాబీయింగ్ జూన్ ఒకటిని కటాఫ్ తేదీగా నిర్ణయించడంపై తీవ్ర గందరగోళం 10 శాతం కూడా బదిలీకి అనర్హులే జీజేఎల్ఏ ప్రతిపాదించిన తేదీని కటాఫ్ నిర్ణయించడంపై ఆగ్రహం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జూనియర్ లెక్చరర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఐదేళ్లు సర్వీసు పూర్తై లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. ప్రభుత్వం సర్వీసు కటాఫ్ తేదీని జూన్ ఒకటో తేదీగా నిర్ణయించడంతో ఫలితం లేకపోయింది. 2011 సంవత్సరంలో జరిగిన బదిలీల్లో దాదాపు 70 శాతం మందికి స్థాన చలనం కలిగింది. ప్రస్తు తం వారి సర్వీసు నాలుగు సంవత్సరాల 11 నెలల పది రోజులు. దీంతో వారందరూ బదిలీ నుంచి విముక్తి పొందుతారు. కేవలం 5 నుంచి 10 శాతం మం ది కూడా బదిలీకి అర్హులు కావడం లేదు. వీరంతా 20 శాతం హెచ్ఆర్ఏ, మంచి స్థానాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రా మీణ ప్రాంతాల్లో పనిచేస్తూ మంచి స్థా నం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు తీరని అన్యా యం జరుగుతోంది. జూన్ ఒకటి కటాఫ్ తేదీ కోసం లాబీయింగ్.. 2011 నుంచి 2015వ తేదీ వరకు జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్ల బదిలీలు జరిగాయి. అయితే ఎప్పుడూ జూన్ ఒకటిని కటాఫ్ తేదీగా నిర్ణయించలేదు. ప్రతిసారీ జూన్ 30వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించి ఐదేళ్లు పూర్తై వారిని కచ్చితంగా బదిలీ చేసేవాళ్లు. 3 ఏళ్ల సర్వీసు పూర్తై వారిని రిక్వెస్టు బదిలీ కింద పరిగణించేవారు. 2013లో మే 31న జనరల్ జీఓ ఇచ్చినా అప్పుడూ కూడా జూన్ 30వ తేదీనే కటాఫ్‌గా నిర్ణయించారు. అయితే ఈసారి మాత్రం కొందరు ప్రయోజనాల కోసం ఓ సంఘం తీవ్ర లాబీయింగ్ చేసినట్లు సమాచారం. ఆ సంఘం వినతి మేరకు ఇంటర్ బోర్డు అధికారులు జూన్ ఒకటికి బదులు జూన్ 30వ తేదీని కటాఫ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 360 మందికి బదిలీ నుంచి విముక్తి జోన్-4లో దాదాపుగా 800 మంది అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పని చేస్తున్నారు. 2011లో జూన్ 30వ తేదీని ఐదేళ్ల సర్వీసుకు కటాఫ్‌గా తీసుకొని దాదాపుగా 400 మందిని బదిలీ చేశారు. వీరందరూ జూన్ 10-15 తేదీల మధ్య రిలీవ్ అయి కొత్త స్థానాల్లో కొలువు దీరారు. ఇందులో 20 శాతం హెచ్ఆర్ఏ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసేవారే అధికం. వీరిలో కొందరు అక్కడి నుంచి బదిలీ కాకుండా ఉండేందుకు ఓ సంఘంతో కలసి లాబీయింగ్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లు పూర్తయితే బదిలీ తప్పనిసరి కావడంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కారణంతో బదిలీ కాకుండా ఉండేందుకు ఎప్పుడూ లేని విధంగా కటాఫ్ తేదీనే మార్పించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిని ఐదేళ్ల సర్వీసుకు కటాఫ్ తేదీగా నిర్ణయించడంతో జోన్-4లో దాదాపుగా 360 మందికి బదిలీ నుంచి విముక్తి లభిచించింది. కర్నూలులో జిల్లాలో కేవలం 12 మంది మాత్రమే బదిలీ అవకాశముంది. కడపలో 8 మందికి, చిత్తూరులో 15 మందికి, అనంతపురంలో 11 మందికి కచ్చిత బదిలీ కానున్నది. ఇలా లెక్కనా జోన్ వ్యాప్తంగా కేవలం పది శాతం మంది కూడా బదిలీ కారు. జూన్ 30వ తేదీని కటాఫ్‌గా నిర్ణయిస్తే.. మరోవైపు జూన్ 30వ తేదీని కటాఫ్‌గా నిర్ణయిస్తే దాదాపుగా 70 శాతం మంది అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు బదిలీ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 500 మందికి స్థాన చలనం కలుగుతుంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధ్యాపకులు మరో ఐదేళ్లు అక్కడే పనిచేయాల్సి ఉంది. ప్రభుత్వం పునరాలోచించాలని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధ్యాపకులు కోరుతున్నారు. -
కన్హయ్య నాలుక కోస్తే..అయిదు లక్షలిస్తా..
న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీ వివాదం కొద్ది కొద్దిగా సద్దుమణుగుతున్న సందర్భంలో బీజీపీ యువజన విభాగం నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెఎన్యూ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ నాలుక తెగ్గోస్తే.. అయిదు లక్షలు బహుమతిగా ఇస్తానంటూ కులదీప్ వార్ష్నే వ్యాఖ్యానించి తాజాగా వివాదానికి తెరలేపారు. భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే ఈ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అఫ్జల్ గురు లాంటి తీవ్రవాదికి మద్దతుగా జాతి వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కన్హయ్య కుమార్ నాలుకను ఎవరైనా కత్తిరించాలని కోరారు. అలా చేసిన వారికి 5 లక్షల రూపాయలను కానుకగా ఇస్తానని చెప్పారు. గురువారం జైలు నుంచి విడుదలైనప్పటినుంచి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అందుకే ఎవరైనా ఈ చర్యకు పూనుకోవాలన్నారు. కాగా కన్హయా దేశద్రోహం ఆరోపణలపై ఫిబ్రవరి 12 న అరెస్టు చేయగా, ఢిల్లీ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈనెల 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం విద్యార్థులనుద్దేశించి రాజద్రోహానికి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు మధ్య తేడాను వివరిస్తూ అతడు ఉత్తేజపూరిత ప్రసంగంతో పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
ఎస్కలేటర్‌లో పడి..
షాంఘై: చైనాలోని షాంఘై నగరంలో ఎస్కలేటర్ ప్రమాదం స్థానికులను భీతావహం సృష్టించింది. స్థానిక షాపింగ్ మాల్లోని ఎస్కలేటర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో ఎస్కలేటర్‌ను శుభ్రం చేస్తున్న 35 ఏళ్ల జాంగ్ అందులో చిక్కుకుపోయాడు. అతని ఎడమకాలు మోకాలి కింది భాగం నుజ్జునుజ్జవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై విచారణ చేపట్టామని షాంఘై అధికారులు ప్రకటించారు. కాగా ఇటీవల చైనాలో ఈ తరహా ప్రమాదం ఇది నాలుగవదని తెలుస్తోంది. -
భారీగా పెరిగిన కటాఫ్
ఇంజనీరింగ్, ఫార్మసీ తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాల్లో ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. ఉత్తమ ర్యాంకులు వచ్చిన విద్యార్థులకే మంచి కాలేజీల్లో సీట్లు లభించాయి. టాప్ కాలేజీల్లోని అన్ని బ్రాంచీల్లో కలిపి పరిశీలిస్తే... గతేడాదికంటే ఈ ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల సగటు ర్యాంకు సగానికిపైగా పెరిగింది. ఉదాహరణకు సీబీఐటీ వంటి కాలేజీలోని అన్ని బ్రాంచీల్లో గతేడాది 6వేల ర్యాంకు వరకు ఓసీ అభ్యర్థులకు సీట్లు వస్తే... ఈసారి 3వేల ర్యాంకులోపే సీట్లన్నీ నిండిపోయాయి. ఈసారి ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు తగ్గిపోవడం, కోర్టు ఆదేశాల వల్ల వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టిన కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో కటాఫ్ భారీగా పెరిగిపోయింది. సీఎస్ఈ, ఈసీఈ వంటి బాగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య తగ్గిపోవడం కూడా దీనికి కారణమైంది. ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు సీట్లు కేటాయించారు. విద్యార్థులు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్లి తమ ర్యాంకు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. గత నెల 18 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టగా.. ఈనెల 17నుంచి 24వ రకు వెబ్ ఆప్షన్లు నిర్వహించారు. 34 కాలేజీలు మూతే! ఈసారి 5 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. మరో 29 కాలేజీల్లో 9 మందిలోపే విద్యార్థులు చేరారు. ఈ 34 కాలేజీలు ఈసారి మూతపడే అవకాశముంది. ఇక 50 మందిలోపు విద్యార్థులు చేరిన కాలేజీల సంఖ్య కూడా మరో 60 నుంచి 70 వరకు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన ఈసారి వంద కాలే జీల్లో పెద్దగా విద్యార్థులు చేరలేదన్నది అర్థం అవుతోంది. ఇక 100 శాతం ప్రవేశాలు జరిగిన కాలేజీలు 79 ఉన్నాయి. 9 వేల మందికి లభించని సీట్లు.. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 86,313 సీట్లు ఉండగా.. 53,347 సీట్లు (61.81 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. 32,966 సీట్లు మిగిలిపోయాయి. అయితే ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో 9,321 మంది విద్యార్థులకు సీట్లు రాలేదు. వారి ర్యాంకును బట్టి కాలేజీని ఎంచుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఫార్మసీకి దెబ్బ: రాష్ట్రంలో 133 ఫార్మసీ కాలేజీల్లో 3,778 ఎంపీసీ స్ట్రీమ్ సీట్లు ఉండగా.. అందులో 125 సీట్లే భర్తీ అయ్యాయి. కాలేజీల సంఖ్య మేర కూడా విద్యార్థులు చేరలేదు. ఇదీ చివరి దశ ప్రవేశాల షెడ్యూల్ * 29న మొదటి దశలో పాల్గొనని వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ * 29 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, ఆప్షన్లలో మార్పులు * 31న సీట్ల కేటాయింపు * ఆగస్టు 1న కాలేజీల్లో చేరేందుకు అవకాశం, అదే రోజునుంచి తరగతులు