నిస్సాన్ కంపెనీ తన ఎక్స్-ట్రైల్ SUVని రూ. 49.92 లక్షల ప్రారంభ ధర వద్ద దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు 7 సీటర్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని సంస్థ సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది.
కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది 163hp పవర్, 300Nm టార్క్ అందిస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, ఆటో-హోల్డ్ ఫంక్షన్, క్రూయిజ్ కంట్రోల్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.
మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు దేశీయ విఫణిలో ప్రధానంగా టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment