నిస్సాన్ కొత్త కారు 'ఎక్స్-ట్రైల్' ఇదే.. విశేషాలేంటో తెలుసా? | Upcoming Nissan Car X Trail Details | Sakshi
Sakshi News home page

నిస్సాన్ కొత్త కారు 'ఎక్స్-ట్రైల్' ఇదే.. విశేషాలేంటో తెలుసా?

Published Wed, Jul 24 2024 8:55 PM | Last Updated on Wed, Jul 24 2024 8:55 PM

Upcoming Nissan Car X Trail Details

ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ప్రస్తుతం భారతదేశంలో మాగ్నైట్ SUVని మాత్రమే విక్రయిస్తోంది. అయితే దేశీయ విఫణిలో తన ఉనికిని చాటుకోవడానికి, వాహన ప్రియులకు చేరువ కావడానికి ఎక్స్-ట్రైల్ లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే కంపెనీ ఈ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ధరలను మాత్రమే వెల్లడికావాల్సి ఉంది.

నాల్గవ తరం నిస్సాన్ ఎక్స్-ట్రైల్.. పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ అనే మూడు మోనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్‌ వంటి ఫీచర్స్ పొందుతుంది.

గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ కారు.. భారతదేశంలో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12 వోల్ట్స్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని పొందుతుంది. ఇంజిన్ 163 పీఎస్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ (FWD) కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది.

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ముందు అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారు ధర రూ. 40 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే ధరలు అధికారికంగా ఆగష్టు 1న వెల్లడవుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement