దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల వల్ల నష్టపోయిన వినియోగదారుల కోసం నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక సహాయక చర్యలు ప్రకటించింది. వరదలతో సతమవుతున్న కంపెనీ వినియోగదారులకు ఉచితంగా తమ వాహనాల కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని కంపెనీ కస్టమర్లకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా నిస్సాన్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. వరదల్లో చిక్కుకున్న వాహనాలను సమీపంలోని కంపెనీ సర్వీస్ వర్క్‌షాప్‌కు తీసుకెళ్లడానికి వీలుగా ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్‌ఎస్‌ఏ) సేవలను ప్రారంభించింది. దాంతోపాటు బీమా వాహనాలకు క్లెయిమ్ ప్రాసెస్ ఫీజు రూ.1000 మినహాయించినట్లు పేర్కొంది. బీమా క్లెయిమ్ చేయాలనుకునే కస్టమర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కంపెనీ లక్ష్యమని తెలిపింది.
ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో కంపెనీ కస్టమర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. వినియోగదారులకు సహాయం చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్(1800 209 3456)ను ఏర్పాటు చేశాం. కస్టమర్లు సత్వర చర్యల కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అన్నారు.
ఇదీ చదవండి: టోల్ ప్లాజాల ‘లైవ్ ట్రాక్’
వరద బాధిత కస్టమర్లకు నిస్సాన్ మోటార్ ఇండియా ఇంజిన్ ఆయిల్ / ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్‌మెంట్‌పై 10%, ఫ్లోర్ కార్పెట్ రీప్లేస్‌మెంట్‌పై 10% ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దాంతోపాటు వరద ప్రభావిత వాహనాలన్నింటికీ కంపెనీ సర్వీస్ వర్క్‌షాప్‌ల్లో ఫిట్‌నెస్ టెస్ట్ వివరాలు అందిస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment