ఉత్తరప్రదేశ్ లో ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతిచెందారు. ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆరుగురు మరణించారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సంఘటనా స్థలంలో విషాద వాతావరణం నెలకొంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం 20 మంది ప్రయాణికులతో వెళుతున్న జీప్ ధాటియా ప్రాంతానికి వెళ్తుండగా ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిప్రి బజార్ కు సమీపంలోని డిగ్రీ కళాశాల దగ్గర జరిగిన ఈ ఘటనలో ట్రక్క్ పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.