భారతదేశంలో కేవలం దేశీయ వాహన తయారీ సంస్థల కార్లు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన కార్లు కూడా విరివిగా ఉపయోగంలో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో ఇండియన్ సెలబ్రిటీల వద్ద అమెరికన్ కంపెనీకి చెందిన 'జీప్ కంపాస్' గురించి తెలుసుకుందాం.
అక్షయ్ కుమార్
బాలీవుడ్ చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఒకరు అక్షయ్ కుమార్. ఇతని గ్యారేజిలో బెంట్లీ, రేంజ్ రోవర్స్, రోల్స్ రాయిస్ వంటి అన్యదేశ కార్లతో పాటు అమెరికన్ కంపెనీకి చెందిన జీప్ కంపాస్ కూడా ఉంది. ఈ SUVని అక్షయ్ కుమార్ ఈ మధ్యనే కొనుగోలు చేసినట్లు తెలిసింది. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
సారా అలీ ఖాన్
జీప్ కంపాస్ కారుని కలిగి ఉన్న సెలబ్రిటీలలో సారా అలీ ఖాన్ ఒకరు. ఈమె బ్లూ కలర్ కంపాస్ కారులో ఇప్పటికే చాలా సార్లు కనిపించినట్లు సమాచారం. ఇది సారా అలీ ఖాన్ తల్లి పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. అంతే కాకుండా సారా గ్యారేజిలో అతి చౌకైన కార్లలో ఒకటైన ఆల్టో 800 కూడా ఉంది.
ఉన్ని ముకుందన్
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరైన ఉన్ని 'ముకుందన్' కూడా ఆటోమొబైల్ ఔత్సాహికుడు. ఇతడు 2017లో రెడ్ కలర్ జీప్ కంపాస్ కొనుగోలు చేసాడు. ఇప్పటికే ఈ కారులో ప్రయాణిస్తూ చాలా సార్లు కనిపించినట్లు సమాచారం.
రియా చక్రవర్తి
జీప్ కంపాస్ కలిగి ఉన్న సెలబ్రిటీలలో రియా చక్రవర్తి ఒకరు. చాల రోజులకు ముందు ఈమె ఆ కారుని కొనుగోలు చేసినప్పటికీ ఎక్కువగా ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు చెబుతారు. అయితే ఈమె జీప్ కంపాస్ SUVలో ఏ వేరియంట్ కొనుగోలు చేసింది అనేది ఖచ్చితంగా తెలియదు. బహుశా అది మిడ్-స్పెక్ వేరియంట్ అని తెలుస్తోంది.
సుదీప్
కన్నడ సినీ రంగంలో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కిచ్చ 'సుదీప్' గత ఏడాది బ్లాక్ కలర్ జీప్ కంపాస్ కొనుగోలు చేశారు. జీప్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలలో సుదీప్ కూడా ఒకరు కావడం గమనార్హం. ఇతని వద్ద టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.
ఉర్ఫీ జావేద్
విపరీతమైన ఫ్యాషన్ సెన్స్‌కు ప్రసిద్ధి చెందిన సెలబ్రిటీ 'ఉర్ఫీ జావేద్' కూడా జీప్ కంపాస్ కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఈమె కంపాస్ 7 సీటర్ స్థానంలో మెరిడియన్ SUV ని చేర్చింది. ఉర్ఫీ జావేద్ తరచుగా ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
ఇక చివరగా బాలీవుడ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా జీప్ కంపాస్ కొనుగోలు చేసింది. తన కోసం కారుని కొనుగోలు చేయడమే కాకుండా తన మేకప్ ఆర్టిస్ట్ కోసం కూడా ఒక కారుని కొనుగోలు చేసింది. ఈమె వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్ మేబ్యాక్ S500 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉంది.
(ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!)
జీప్ కంపాస్
జీప్ కంపెనీకి చెందిన కంపాస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. భారతీయ మార్కెట్లో ఈ ఎస్‌యువి ప్రారంభ ధరలు రూ. 17.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). డిజైన్ ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది దీనిని ఎగబడిమరీ కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment