Jeep Compass
-
ఇండియన్ సెలబ్రిటీల మనసు దోచిన అమెరికన్ బ్రాండ్ కారు, ఇదే
భారతదేశంలో కేవలం దేశీయ వాహన తయారీ సంస్థల కార్లు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన కార్లు కూడా విరివిగా ఉపయోగంలో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో ఇండియన్ సెలబ్రిటీల వద్ద అమెరికన్ కంపెనీకి చెందిన 'జీప్ కంపాస్' గురించి తెలుసుకుందాం. అక్షయ్ కుమార్ బాలీవుడ్ చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఒకరు అక్షయ్ కుమార్. ఇతని గ్యారేజిలో బెంట్లీ, రేంజ్ రోవర్స్, రోల్స్ రాయిస్ వంటి అన్యదేశ కార్లతో పాటు అమెరికన్ కంపెనీకి చెందిన జీప్ కంపాస్ కూడా ఉంది. ఈ SUVని అక్షయ్ కుమార్ ఈ మధ్యనే కొనుగోలు చేసినట్లు తెలిసింది. బ్లాక్ కలర్లో ఉన్న ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సారా అలీ ఖాన్ జీప్ కంపాస్ కారుని కలిగి ఉన్న సెలబ్రిటీలలో సారా అలీ ఖాన్ ఒకరు. ఈమె బ్లూ కలర్ కంపాస్ కారులో ఇప్పటికే చాలా సార్లు కనిపించినట్లు సమాచారం. ఇది సారా అలీ ఖాన్ తల్లి పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం. అంతే కాకుండా సారా గ్యారేజిలో అతి చౌకైన కార్లలో ఒకటైన ఆల్టో 800 కూడా ఉంది. ఉన్ని ముకుందన్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరైన ఉన్ని 'ముకుందన్' కూడా ఆటోమొబైల్ ఔత్సాహికుడు. ఇతడు 2017లో రెడ్ కలర్ జీప్ కంపాస్ కొనుగోలు చేసాడు. ఇప్పటికే ఈ కారులో ప్రయాణిస్తూ చాలా సార్లు కనిపించినట్లు సమాచారం. రియా చక్రవర్తి జీప్ కంపాస్ కలిగి ఉన్న సెలబ్రిటీలలో రియా చక్రవర్తి ఒకరు. చాల రోజులకు ముందు ఈమె ఆ కారుని కొనుగోలు చేసినప్పటికీ ఎక్కువగా ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు చెబుతారు. అయితే ఈమె జీప్ కంపాస్ SUVలో ఏ వేరియంట్ కొనుగోలు చేసింది అనేది ఖచ్చితంగా తెలియదు. బహుశా అది మిడ్-స్పెక్ వేరియంట్ అని తెలుస్తోంది. సుదీప్ కన్నడ సినీ రంగంలో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కిచ్చ 'సుదీప్' గత ఏడాది బ్లాక్ కలర్ జీప్ కంపాస్ కొనుగోలు చేశారు. జీప్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలలో సుదీప్ కూడా ఒకరు కావడం గమనార్హం. ఇతని వద్ద టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఉర్ఫీ జావేద్ విపరీతమైన ఫ్యాషన్ సెన్స్‌కు ప్రసిద్ధి చెందిన సెలబ్రిటీ 'ఉర్ఫీ జావేద్' కూడా జీప్ కంపాస్ కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఈమె కంపాస్ 7 సీటర్ స్థానంలో మెరిడియన్ SUV ని చేర్చింది. ఉర్ఫీ జావేద్ తరచుగా ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇక చివరగా బాలీవుడ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీలంక నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా జీప్ కంపాస్ కొనుగోలు చేసింది. తన కోసం కారుని కొనుగోలు చేయడమే కాకుండా తన మేకప్ ఆర్టిస్ట్ కోసం కూడా ఒక కారుని కొనుగోలు చేసింది. ఈమె వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్ మేబ్యాక్ S500 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉంది. (ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!) జీప్ కంపాస్ జీప్ కంపెనీకి చెందిన కంపాస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. భారతీయ మార్కెట్లో ఈ ఎస్యువి ప్రారంభ ధరలు రూ. 17.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). డిజైన్ ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది దీనిని ఎగబడిమరీ కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
అమెరికన్ బ్రాండ్ కార్లపై రూ. 2.35 లక్షలు తగ్గింపు - పూర్తి వివరాలు
అమెరికన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ 'జీప్' (Jeep) భారతీయ మార్కెట్లో కంపాస్, మెరిడియన్, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి నాలుగు SUVలను విక్రయిస్తోంది. అయితే కంపెనీ ఈ నెలలో తన కంపాస్, మెరిడియన్ బేస్ వేరియంట్ల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జీప్ మెరిడియన్ బేస్ మోడల్ లిమిటెడ్ MT ధర రూ. 2.35 లక్షలు తగ్గింది. ధరల తగ్గుదల తర్వాత దీని ధర రూ. 27.75 లక్షలు. ఇందులో లిమిటెడ్ AT మోడల్ ధర రూ. 32 లక్షలు. ఈ ధరలలో ఎటువంటి మార్పు లేదు. అదే సమయంలో లిమిటెడ్ (O) ట్రిమ్ ధర రూ. 35వేలు వరకు పెరిగింది. ఈ మోడల్ కొత్త ధర రూ. 32.95 లక్షలు. ఇక కంపాస్ స్పోర్ట్ ఎటి పెట్రోల్ మోడల్ ధర ఇప్పుడు రూ. 20.99 లక్షలు. ఈ ఎస్యువి ధరలను కంపెనీ రూ. 1.08 లక్షలు తగ్గించింది. ధరల తగ్గుదలకు ముందు దీని ధర రూ. 22.07 లక్షలు. అదే సమయంలో లిమిటెడ్ ఏటి, మోడల్ ఎస్ ఏటి ధరలలో ఎటువంటి మార్పులు లేదు. (ఇదీ చదవండి: కృతి ఖర్బందా కొత్త కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు!) జీప్ కంపాస్ డీజిల్ ధరల విషయానికి వస్తే.. అన్ని మోడల్స్ ధరలు రూ. 35,000 తగ్గాయి. ఇందులో లిమిటెడ్, మోడల్ ఎస్ సిరీస్, 4X4 మోడల్ మొదలైనవి ఉన్నాయి. కొత్త ఉద్గార ప్రమాణాలు అమలులోకి రావడం వల్ల ఈ మోడల్స్ ధరలు తగ్గి ఉండవచ్చని భావిస్తున్నారు. కంపాస్ రెండూ డీజిల్ ఇంజన్స్ పొందుతుంది, అవి1.4-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ & 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్. అదే సమయంలో మెరిడియన్ ఒకే సింగిల్ డీజిల్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. అయితే పనితీరు పరంగా రెండూ అద్భుతంగా ఉంటాయి. -
భారత్‌లోకి జీప్ మెరీడియన్.. తొలి ఎస్యూవీ ఇదే!
ఆటోమోటివ్ గ్రూప్ స్టెలాంటిస్‌కు చెందిన జీప్ ఇండియా సరికొత్త ఎస్యూవీ మెరీడియన్‌ను ఆవిష్కరించింది. జూన్ నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ మంగళవారం ప్రకటించింది. మూడు వరుసల సీట్లతో కంపెనీ నుంచి తొలి ఎస్యూవీ ఇదే. భారత మార్కెట్ కోసం దీనిని రూపొందించారు. 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, 9 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. దేశీయ మార్కెట్ కోసం రాంగ్లర్, కాంపాస్‌తోసహా అయిదు మోడళ్ల అభివృద్ధికై రూ.1,900 కోట్లు ఖర్చు చేశామని స్టెలాంటిస్ ఇండియా సీఈవో, ఎండీ రోలాండ్ బుషే తెలిపారు. గ్రాండ్ చెరోకీ, కాంపాస్ ట్రయల్‌హాక్ సైతం ఈ ఏడాదే భారత రోడ్లపైకి దూసుకెళ్లనున్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ మరియు పవర్డ్ లిఫ్ట్‌గేట్ వంటివి ఉన్నాయి. కొత్త జీప్ మెరిడియన్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అబ్స్టాకిల్ డిటెక్షన్ & యాంటీ పించ్ సెన్సింగ్ సేఫ్టీ సిస్టమ్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. (చదవండి: ఎన్సీడీ హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్ ఫిన్వెస్ట్ డిఫాల్ట్!) -
జీప్ రాంగ్లర్ ఎస్యూవి వెహికల్ కొనేవారికి షాక్!
మీరు కొత్తగా జీప్ రాంగ్లర్ ఎస్యూవి కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక చేదువార్త. జీప్ ఇండియా గత వారం కంపాస్ ధరలను భారీగా పెంచగా, ఈ సారి రాంగ్లర్ ధరలను గణనీయంగా పెంచింది. ఈ ఏడాది మార్చిలో జీప్ ఇండియా భారతదేశంలో రాంగ్లర్ ఎస్‌యూవిని అసెంబుల్ చేయడం ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం కంపాస్, రాంగ్లర్ వాహనాలను పూణేలోని రంజన్ గావ్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఇది ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా ఉంది. అన్ లిమిటెడ్, రూబికాన్ అనే రెండు వేరియెంట్లలో రాంగ్లర్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ రెండు వేరియెంట్ల ధరలు రూ.1,25,000 పెరిగాయి. అన్ లిమిటెడ్ ధర ఇప్పుడు రూ.55.15 లక్షలు కాగా, రూబికాన్ రూ.59.15 లక్షలుగా దేశంలో ఇంతకు ముందు అమ్మకానికి వచ్చిన సీబియు వెర్షన్ కంటే రాంగ్లర్ సుమారు రూ.10 లక్షలు చౌక. మనదేశంలో అసెంబుల్ చేసిన ఈ జీప్ రాంగ్లర్ ఎస్యూవి 5-డోర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. దీనికి పాత మోడల్ లాగానే 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 268 హెచ్‌పి శక్తిని, 400 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వస్తుంది. (చదవండి: ఎలాన్ మస్క్, జెఫ్‌బెజోస్: వీళ్లిద్దరూ ఏక్ నెంబర్ 'పిసినారులు') ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్లు, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, లెదర్ అప్హోల్స్టరీ, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 7.0-ఇంచ్ కలర్ ఎంఐడి స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ / స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రాంగ్లర్ ఎస్యూవీ కావడంతో రిమువబుల్ డోర్స్, హార్డ్ టాప్ పైకప్పు ఉంటుంది. జీప్ రాంగ్లర్ లో ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా స్టాండర్డ్ సేఫ్టీ పరంగా అందిస్తుంది. -
ఫియట్ తొలి మేడిన్ ఇండియా ‘జీప్ కంపాస్’
మూడో త్రైమాసికంలో మార్కెట్లోకి పుణే: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫియట్ క్రిస్లర్’ భారతీయ అనుబంధ సంస్థ ‘ఎఫ్సీఏ ఇండియా ఆటోమొబైల్స్’ తాజాగా తొలి మేడిన్ ఇండియా ‘జీప్ కంపాస్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. పుణేలోని రన్జన్గావ్ ప్లాంటులో జరిగిన ఈ ఎస్యూవీ ఆవిష్కరణ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్సీఏ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (ఆసియా పసిఫిక్ ప్రాంతం, చైనా మినహా) పాల్ అల్కల, ఎఫ్సీఏ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ ఫ్లిన్ తదితరులు పాల్గొన్నారు. తాజా ఆవిష్కరణతో జీప్ కంపాస్ ఎస్‌యూవీలను తయారు చేసి, ఎగుమతి చేసే దేశాల (చైనా, మెక్సికో, బ్రెజిల్) సరసన భారత్ కూడా చేరింది. జీప్ వాహనాల స్థానిక తయారీకి 280 మిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేశామని అల్కల తెలిపారు. పేర్కొన్నారు. జీప్ కంపాస్‌ను ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పారు.