మీరు కొత్తగా జీప్ రాంగ్లర్ ఎస్‌యూవి కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక చేదువార్త. జీప్ ఇండియా గత వారం కంపాస్ ధరలను భారీగా పెంచగా, ఈ సారి రాంగ్లర్ ధరలను గణనీయంగా పెంచింది. ఈ ఏడాది మార్చిలో జీప్ ఇండియా భారతదేశంలో రాంగ్లర్ ఎస్‌యూవిని అసెంబుల్ చేయడం ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం కంపాస్, రాంగ్లర్ వాహనాలను పూణేలోని రంజన్ గావ్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఇది ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా ఉంది. అన్ లిమిటెడ్, రూబికాన్ అనే రెండు వేరియెంట్లలో రాంగ్లర్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ రెండు వేరియెంట్ల ధరలు రూ.1,25,000 పెరిగాయి.
అన్ లిమిటెడ్ ధర ఇప్పుడు రూ.55.15 లక్షలు కాగా, రూబికాన్ రూ.59.15 లక్షలుగా దేశంలో ఇంతకు ముందు అమ్మకానికి వచ్చిన సీబియు వెర్షన్ కంటే రాంగ్లర్ సుమారు రూ.10 లక్షలు చౌక. మనదేశంలో అసెంబుల్ చేసిన ఈ జీప్ రాంగ్లర్ ఎస్‌యూవి 5-డోర్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. దీనికి పాత మోడల్ లాగానే 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 268 హెచ్‌పి శక్తిని, 400 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వస్తుంది. (చదవండి: ఎలాన్ మస్క్, జెఫ్‌బెజోస్: వీళ్లిద్దరూ ఏక్ నెంబర్ 'పిసినారులు')
ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, లెదర్ అప్హోల్స్టరీ, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 7.0-ఇంచ్ కలర్ ఎంఐడి స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ / స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రాంగ్లర్ ఎస్‌యూవీ కావడంతో రిమువబుల్ డోర్స్, హార్డ్ టాప్ పైకప్పు ఉంటుంది. జీప్ రాంగ్లర్ లో ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా స్టాండర్డ్ సేఫ్టీ పరంగా అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment