ఫియట్ తొలి మేడిన్ ఇండియా ‘జీప్ కంపాస్’
మూడో త్రైమాసికంలో మార్కెట్‌లోకి
పుణే: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫియట్ క్రిస్లర్’ భారతీయ అనుబంధ సంస్థ ‘ఎఫ్‌సీఏ ఇండియా ఆటోమొబైల్స్’ తాజాగా తొలి మేడిన్ ఇండియా ‘జీప్ కంపాస్’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. పుణేలోని రన్‌జన్‌గావ్ ప్లాంటులో జరిగిన ఈ ఎస్‌యూవీ ఆవిష్కరణ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సీఏ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (ఆసియా పసిఫిక్ ప్రాంతం, చైనా మినహా) పాల్ అల్కల, ఎఫ్‌సీఏ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ ఫ్లిన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా ఆవిష్కరణతో జీప్ కంపాస్ ఎస్‌యూవీలను తయారు చేసి, ఎగుమతి చేసే దేశాల (చైనా, మెక్సికో, బ్రెజిల్) సరసన భారత్ కూడా చేరింది. జీప్ వాహనాల స్థానిక తయారీకి 280 మిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేశామని అల్కల తెలిపారు. పేర్కొన్నారు. జీప్ కంపాస్‌ను ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మార్కెట్‌లోకి తీసుకువస్తామని చెప్పారు.