ఆటోమోటివ్ గ్రూప్ స్టెలాంటిస్‌కు చెందిన జీప్ ఇండియా సరికొత్త ఎస్‌యూవీ మెరీడియన్‌ను ఆవిష్కరించింది. జూన్ నుంచి డెలివరీలు ఉంటాయని కంపెనీ మంగళవారం ప్రకటించింది. మూడు వరుసల సీట్లతో కంపెనీ నుంచి తొలి ఎస్‌యూవీ ఇదే. భారత మార్కెట్ కోసం దీనిని రూపొందించారు. 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, 9 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. దేశీయ మార్కెట్ కోసం రాంగ్లర్, కాంపాస్‌తోసహా అయిదు మోడళ్ల అభివృద్ధికై రూ.1,900 కోట్లు ఖర్చు చేశామని స్టెలాంటిస్ ఇండియా సీఈవో, ఎండీ రోలాండ్ బుషే తెలిపారు.
గ్రాండ్ చెరోకీ, కాంపాస్ ట్రయల్‌హాక్ సైతం ఈ ఏడాదే భారత రోడ్లపైకి దూసుకెళ్లనున్నాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు పవర్డ్ లిఫ్ట్‌గేట్ వంటివి ఉన్నాయి. కొత్త జీప్ మెరిడియన్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అబ్స్టాకిల్ డిటెక్షన్ & యాంటీ పించ్ సెన్సింగ్ సేఫ్టీ సిస్టమ్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
(చదవండి: ఎన్‌సీడీ హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్ ఫిన్‌వెస్ట్ డిఫాల్ట్!)
Comments
Please login to add a commentAdd a comment